వింగ్ కమాండర్ అభినందన్‌కు తొలి పోస్టింగ్.. ఎక్కడంటే..?

| Edited By:

May 13, 2019 | 10:41 AM

పాక్ చెరలో దాదాపు మూడు రోజులు బందీగా ఉండి విడుదలైన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తిరిగి విధులకు హాజరయ్యారు. రాజస్థాన్‌లోని సూరత్ ఘడ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో అధికారులు ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. శనివారమే ఆయన బాధ్యతలను చేపట్టారు. కాగా, గతంలో బికనేర్ లో పనిచేసిన అభినందన్.. అక్కడే చదువుకున్నాడు కూడా. అయితే అభినందన్‌కు పోస్టింగ్ ఇచ్చినప్పటికీ ఎటువంటి విధులు అప్పగించారన్న విషయాన్ని వెల్లడించేందుకు మాత్రం అధికారులు నిరాకరించారు. సూరత్‌గఢ్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో […]

వింగ్ కమాండర్ అభినందన్‌కు తొలి పోస్టింగ్.. ఎక్కడంటే..?
Follow us on

పాక్ చెరలో దాదాపు మూడు రోజులు బందీగా ఉండి విడుదలైన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తిరిగి విధులకు హాజరయ్యారు. రాజస్థాన్‌లోని సూరత్ ఘడ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో అధికారులు ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. శనివారమే ఆయన బాధ్యతలను చేపట్టారు. కాగా, గతంలో బికనేర్ లో పనిచేసిన అభినందన్.. అక్కడే చదువుకున్నాడు కూడా.

అయితే అభినందన్‌కు పోస్టింగ్ ఇచ్చినప్పటికీ ఎటువంటి విధులు అప్పగించారన్న విషయాన్ని వెల్లడించేందుకు మాత్రం అధికారులు నిరాకరించారు. సూరత్‌గఢ్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో మిగ్-21 బైసన్ యుద్ధ విమానం ఉండడంతో దానికి సంబంధించిన విధులే ఆయనకు అప్పగించి ఉంటారని తెలుస్తోంది. అయితే, ఒకసారి పైలట్ విధుల నుంచి తప్పించిన ఆయనకు ప్రొటోకాల్ ప్రకారం తిరిగి ఫ్లైయింగ్ బాధ్యతలు అప్పగించవచ్చా? అన్న ప్రశ్నతలెత్తుతోంది.