‘అల’ మ్యూజికల్ ఈవెంట్.. ఎక్కడా కనిపించని ‘బుట్టబొమ్మ’..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడవ చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ మ్యూజికల్ ఈవెంట్ నిన్న సాయంత్రం యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర యూనిట్‌తో పాటుగా అల్లు ఫ్యామిలీ కుటుంబ సభ్యులు, పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అయితే చిత్రంలో నటించిన మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డే రాలేదన్న […]

  • Ravi Kiran
  • Publish Date - 8:43 pm, Tue, 7 January 20
'అల' మ్యూజికల్ ఈవెంట్.. ఎక్కడా కనిపించని 'బుట్టబొమ్మ'..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడవ చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ మ్యూజికల్ ఈవెంట్ నిన్న సాయంత్రం యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర యూనిట్‌తో పాటుగా అల్లు ఫ్యామిలీ కుటుంబ సభ్యులు, పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అయితే చిత్రంలో నటించిన మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డే రాలేదన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఒక్క ఈ కార్యక్రమానికే కాదు.. త్రివిక్రమ్ గత చిత్రం ‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా పూజా హాజరు కాలేదు. ‘అజ్ఞాతవాసి’ అట్టర్ ప్లాప్ తర్వాత త్రివిక్రమ్ చాలా గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కొన్ని అంశాల్లో ఈ మూవీ నెగటివ్ కామెంట్స్ దక్కించుకున్నా.. చివరికి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. నాడు ‘అరవింద సమేత’ ఈవెంట్‌కు పూజా హాజరు కాకపోవడం వెనుక ఒక రీజన్ ఉంది. అప్పుడు ఒకేసారి మూడు సినిమాలకు కమిట్ కావడంతో కార్యక్రమానికి రాలేకపోయింది. అయితే ఇప్పుడు పూజా హెగ్డే ‘జాన్’ సినిమా తప్పితే వేరే ఏ సినిమాను ఒప్పుకోలేదు. అలాంటప్పుడు ఈ ఈవెంట్‌ను మర్చిపోవడం ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

‘అల’లో పూజా హెగ్డే హీరోయిన్‌ కాగా.. టబు, నివేదా పేతురాజ్, రాజేంద్ర ప్రసాద్, జయరామ్, సచిన్ కడేకర్, మురళీ శర్మ, సముద్రఖని, నవదీప్, సుశాంత్, సునీల్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్. ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.