అయోధ్య తీర్పుకు, నవంబర్ 17వ తేదీకి లింకేంటి..?

| Edited By:

Oct 19, 2019 | 3:07 PM

అయోధ్య.. మరోసారి తెరపైకి వచ్చిన అంశం. దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంలో ఇప్పటికే వాదనలు పూర్తయిన విషయం తెలిసిందే. అయితే తీర్పును రిజర్వ్‌లో పెట్టడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తీర్పు ఎప్పుడు వెలవడుతుందో అన్న దానిపై అంతా ఎదురుచూస్తున్నారు. అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వరుసగా 40 రోజుల పాటు విచారించింది. దీంతో సుప్రీం చ‌రిత్ర‌లో అతిసుదీర్ఘ వాద‌న‌లు జ‌రిగిన రెండవ కేసుగా […]

అయోధ్య తీర్పుకు, నవంబర్ 17వ తేదీకి లింకేంటి..?
Follow us on

అయోధ్య.. మరోసారి తెరపైకి వచ్చిన అంశం. దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంలో ఇప్పటికే వాదనలు పూర్తయిన విషయం తెలిసిందే. అయితే తీర్పును రిజర్వ్‌లో పెట్టడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తీర్పు ఎప్పుడు వెలవడుతుందో అన్న దానిపై అంతా ఎదురుచూస్తున్నారు.

అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వరుసగా 40 రోజుల పాటు విచారించింది. దీంతో సుప్రీం చ‌రిత్ర‌లో అతిసుదీర్ఘ వాద‌న‌లు జ‌రిగిన రెండవ కేసుగా ఇది రికార్డులో నిలిచింది. గ‌తంలో కేశ‌వానంద భార‌తి కేసులో సుప్రీం ధ‌ర్మాస‌నం అత్య‌ధికంగా 68 రోజుల పాటు విచారించింది. ఇక ఆధార్ కేసును అత్యున్న‌త న్యాయ‌స్థానం 38 రోజుల పాటు విచారించింది. అయోధ్య కేసులో అల‌హాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును వ్య‌తిరేకిస్తూ మొత్తం 14 కేసులు దాఖ‌ల‌య్యాయి. అయోధ్య‌లో వివాదాస్ప‌దంగా ఉన్న 2.77 ఎక‌రాల భూమిని మూడు భాగాలు పంచాల‌ని గ‌తంలో తీర్పునిచ్చారు. సున్నీ వ‌క్ఫ్ బోర్డు, నిర్మోహి అకాడా, రామ్ ల‌ల్లాకు ఇవ్వాల‌ని సూచించారు. హిందువుల మ‌నోభావాల‌కు కేంద్ర బిందువుగా మారిన అయోధ్య కేసులో.. తుది తీర్పు న‌వంబ‌ర్ 17వ తేదీలోగా వెలుబ‌డే అవ‌కాశాలు ఉన్నాయి.

అయితే అయోధ్య తీర్పుకు.. నవంబర్ 17వ తేదీకి మధ్య అసలు లింకు ఏంటి అన్నదానిపై పలు రకాల చర్చలు జరుగుతున్నాయి.  వచ్చే నెలలోనే చీఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గ‌గోయ్ రిటైర్ అవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో చరిత్రలో నిలిచిపోయేలా ఓ చారిత్రాత్మక తీర్పును ఆయనే ఇస్తారంటూ ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అంతేకాదు.. కొన్ని జాతీయ వార్తా సంస్థలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నవంబర్ 17వ తేదీ లోపు తీర్పు రాబోతోందని తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో మరో వార్త కూడా హల్ చల్ చేస్తోంది. నవంబర్ 17వ తేదీ ఇద్దరు హిందూ నేతలు పరమపదించిన రోజు. అంతేకాదు వారు ఇద్దరు కూడా బాబ్రీ మసీదు వివాదంలో ఉన్న నేతలే. వారు ఒకరు విశ్వ హిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్, మరో నేత శివసేన వ్యవస్థాపకులు బాల్ థాక్రే. ఒకరేమో ప్రత్యక్షంగా బాబ్రీ కూల్చివేతలో పాల్గొంటే.. మరోకరు పరోక్షంగా పాల్గొన్నారు.

అశోక్ సింఘాల్‌పై అప్పట్లో కేసులు కూడా నమోదయ్యాయి. అయితే బాల్ థాక్రే మాత్రం ఆయన క్యాడర్ కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు ప్రకటించుకున్నారు. అయితే వీరిరువురు కూడా ఒకే తేదీన మరణించారు. అయితే వారి చిరకాల స్వప్నం భవ్య రామ మందిర నిర్మాణమని.. ఈ నేపథ్యంలో అదే రోజు మందిరానికి అనుకూలంగా తీర్పు రాబోతున్నట్లు ఆ సంస్థల నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే నవంబర్ 17 తేదీన తీర్పు రాబోతుందా.. లేదా ముందే వెలువడుతుందా అన్నది మరి కొద్ది రోజులు వేచి చూస్తే తేలిపోతుంది.