కరోనాతో విశ్వవ్యాప్తంగా పెరిగిన ఆకలి కేకలు..!

|

May 29, 2020 | 3:11 PM

విశ్వవ్యాప్తంగా రాకాసి కోరలతో నలిపేస్తోంది కరోనా మహమ్మారీ. ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ లోకి నెట్టేసింది. దీంతో అయా దేశాల్లో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయాయి. చేసేందుకు ఉపాధి లేక కడుపు నిండ తిండి లేక నానావస్థలు పడుతున్నారు జనం. తినేందుకు పట్టెడన్నం కూడా కరువవుతోందని ఐక్యరాజ్యసమితి ధృవీకరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రతను కోల్పోయిన వారి సంఖ్య ఈ ఏడాది రెట్టింపైందని ఓ నివేదికలో వెల్లడైందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. తినేందుకు సరియైన ఆహారం దొరకని వారి సంఖ్య […]

కరోనాతో విశ్వవ్యాప్తంగా పెరిగిన ఆకలి కేకలు..!
Follow us on

విశ్వవ్యాప్తంగా రాకాసి కోరలతో నలిపేస్తోంది కరోనా మహమ్మారీ. ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ లోకి నెట్టేసింది. దీంతో అయా దేశాల్లో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయాయి. చేసేందుకు ఉపాధి లేక కడుపు నిండ తిండి లేక నానావస్థలు పడుతున్నారు జనం. తినేందుకు పట్టెడన్నం కూడా కరువవుతోందని ఐక్యరాజ్యసమితి ధృవీకరించింది.
ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రతను కోల్పోయిన వారి సంఖ్య ఈ ఏడాది రెట్టింపైందని ఓ నివేదికలో వెల్లడైందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. తినేందుకు సరియైన ఆహారం దొరకని వారి సంఖ్య సుమారు 265 మిలియన్లకు చేరుకుందని ప్రపంచ ఆహార కార్యక్రమం (WHO) తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ పతనమైన.. పర్యాటక ఆదాయాలు కోల్పోయినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా రాకపోకలు నిలిచిపోయి.. చెల్లింపులు పడిపోవడం, ప్రయాణాలు నిలిపి వేయడం లావాదేవీలు లేకుండా పోయాయి. ఇతర ఆంక్షల ప్రభావంతో ఈ ఏడాది సుమారు 130 మిలియన్ల మంది తీవ్ర ఆకలి బాధను ఎదుర్కొనవచ్చని డబ్ల్యూహెచ్ వో హెచ్చరించింది. ఇప్పటికే సుమారు 135 మిలియన్ల మంది ఈ కేటగిరీలో చేరినట్లు పేర్కొంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్ లో ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించింది.