Whatsapp Groups: మీకు వాట్సాప్ గ్రూప్ ఉందా.. అయితే ఇది తప్పక చదవాల్సిందే..

|

Feb 23, 2020 | 2:43 PM

ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరికి వాట్సాప్ గ్రూప్స్ మెయింటైన్ చేయడం అలవాటుగా మారిపోయింది. అయితే ఆయా గ్రూపుల్లో మీరు పెట్టే మెసేజ్‌లు సీక్రెట్‌గా ఉంటున్నాయని అనుకుంటే పొరపాటు..

Whatsapp Groups: మీకు వాట్సాప్ గ్రూప్ ఉందా.. అయితే ఇది తప్పక చదవాల్సిందే..
Follow us on

Whatsapp Groups: ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరికి వాట్సాప్ గ్రూప్స్ మెయింటైన్ చేయడం అలవాటుగా మారిపోయింది. ఆఫీస్ కార్యకలాపాలకు, స్నేహితుల కోసం, కుటుంబం కోసం.. ఇలా ఎన్నో గ్రూపుల్లో సభ్యులుగా ఉంటున్నారు. వారికి ఏ గ్రూప్ నుంచి కూడా బయటికి రాలేని పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తయితే.. ఆయా గ్రూపుల్లో మీరు పెట్టే మెసేజ్‌లు సీక్రెట్‌గా ఉంటున్నాయని అనుకుంటే పొరపాటు.. నిజమండీ మనకి తెలియకుండా అవన్నీ కూడా అపరిచిత వ్యక్తులకు చేరుతున్నాయట.? ఒక్క మెసేజ్‌లు మాత్రమే కాదు. గ్రూప్‌లోని సభ్యుల వివరాలు కూడా బహిర్గతమవుతున్నాయని సమాచారం. దీనికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం…

Also Read: ట్రెండీ ‘ఐస్‌క్రీమ్ దోశ’.. టేస్ట్‌కు జనాలు ఫిదా..

సాధారణంగా వాట్సాప్ గ్రూపుల్లోకి చేరాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఫోన్ నెంబర్ ఆధారంగా అయితే.. మరొకటి లింక్ ద్వారా బయట వ్యక్తులు మనల్ని ఆహ్వానిస్తారు. ఇక ఈ లింక్‌తోనే అసలు చిక్కు వచ్చిపడింది. అపరిచిత వ్యక్తులు ఆ లింక్‌ను గూగుల్‌‌లో సెర్చ్ చేసి వాట్సాప్ గ్రూప్‌తో పాటు అందులో ఉన్న సభ్యుల ఫోన్ నెంబర్లను కూడా తెలుసుకునే అవకాశం ఉందట.

Also Read:నన్ను చంపేయ్ అమ్మా.. 9 ఏళ్ళ చిన్నారి ఆవేదన.. వీడియో వైరల్..

ఇక ఆ లింక్‌ను కేవలం ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లలో ఉంచినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుందని జేన్‌ వంగ్‌ అనే ఇంజినీర్‌ నిరూపించారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 4,70,000 వాట్సాప్‌ గ్రూపుల వివరాలు గూగుల్‌లో లభ్యమవుతున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, వాట్సాప్ గ్రూపుల్లో ఎవరినైనా చేర్చాలంటే వారికి వ్యక్తిగతంగా మాత్రమే లింక్‌ను పంపించాలని.. సామజిక మాధ్యమాల్లో పెట్టవద్దని సంస్థ అధికారి ఒకరు తెలియజేశారు.

Also Read:  UP Sonbhadra No Discovery Of Gold Mines