Ex Lieutenant Governor Kiran Bedi: ఇది జీవిత పర్యంత అనుభవం, వీడ్కోలు సందేశంలో పుదుచ్ఛేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ

| Edited By: Pardhasaradhi Peri

Feb 17, 2021 | 10:34 AM

పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా తనకు ప్రభుత్వం ఇచ్చిన 'జీవిత పర్యంత అనుభవం'  పట్ల కిరణ్ బేడీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో

Ex Lieutenant Governor Kiran Bedi: ఇది జీవిత పర్యంత అనుభవం, వీడ్కోలు సందేశంలో పుదుచ్ఛేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ
Follow us on

Ex Lieutenant Governor Kiran Bedi: పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా తనకు ప్రభుత్వం ఇచ్చిన ‘జీవిత పర్యంత అనుభవం’  పట్ల కిరణ్ బేడీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఒక్కసారిగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమెను మంగళవారం రాత్రి కేంద్రం పదవి నుంచి తొలగించింది. ఈ ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్ గా తన ప్రయాణంలో భాగమైన వారందరికీ, ప్రభుత్వ అధికారులతో సహా  కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆమె ట్వీట్ చేశారు. ఈమె తొలగింపునకు సంబంధించి నిన్న రాత్రి రాష్ట్రపతి భవన్  నుంచి నోటీసు అందింది. పుదుచ్చేరిలో మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీని బలహీనపరచేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈమె తొలగింపును రాజకీయ అస్త్రంగా వినియోగించుకుందని భావిస్తున్నారు.

 

దయార్ద్ర హృదయం, దూసుకెళ్లే తత్వం, సాహస స్ఫూర్తి అనే పదాలతో కూడిన పేపర్ కవర్ ని కిరణ్ బేడీ తన టేబుల్ పై ఉంచారు. పుదుచ్ఛేరి కొత్త గవర్నర్ నియామకం జరిగేవరకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఈ ప్రాంత తాత్కాలిక గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. కాగా కిరణ్ బేడీ తొలగింపును సీఎం నారాయణ స్వామి ‘ప్రజా విజయం’ గా అభివర్ణించారు. పుదుచ్చేరి ప్రభుత్వానికి, కిరణ్ బేడీకి మధ్య మొదటినుంచీ సత్సంబంధాలు లేవు. తన తొలగింపును కిరణ్ బేడీ ఊహించలేదని చెబుతున్నారు. నిన్న సాయంత్రం వరకు ఆమె తన కార్యాలయ విధులతో బిజీగా గడిపారు.