కోహ్లీ, ఆజామ్‌ల ఆటను చూస్తే సచిన్ గుర్తొస్తాడు.!

ప్రస్తుత క్రికెట్‌లో మేటి బ్యాట్స్‌మెన్‌ ఎవరంటే.. అందరూ కూడా ఠక్కున విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్, బాబర్ ఆజామ్ అని అంటారు.

కోహ్లీ, ఆజామ్‌ల ఆటను చూస్తే సచిన్ గుర్తొస్తాడు.!

Edited By:

Updated on: Aug 10, 2020 | 8:26 PM

Virat Kohli And Babar Azam Looks Like Sachin Tendulkar: ప్రస్తుత క్రికెట్‌లో మేటి బ్యాట్స్‌మెన్‌ ఎవరంటే.. అందరూ కూడా ఠక్కున విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్, బాబర్ ఆజామ్ అని అంటారు. వీరిలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజామ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇద్దరూ కూడా వారి జట్లకు క్లిష్ట సమయాల్లో కూడా అద్భుతమైన విజయాలు అందించడమే కాకుండా మెరుగ్గా రాణిస్తూ అందరి చేతా ప్రశంసలు అందుకుంటున్నారు.

ఇద్దరి బ్యాటింగ్ స్టైల్ మాత్రమే కాదు.. ఫుట్ వర్క్, షాట్స్ కూడా ఒకేలా ఉంటాయని ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే వీరిద్దరినీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పోలుస్తూ వెస్టిండీస్ దిగ్గజ ప్లేయర్ ఇయాన్ బిషప్ ప్రశంసలు కురిపించాడు. విరాట్ కోహ్లీ, బాబర్ ఆజామ్ స్ట్రయిట్‌గా ఆడటం చూస్తుంటే తనకు సచిన్ గుర్తుకు వస్తాడని, తన బౌలింగ్‌లో మాస్టర్ బ్లాస్టర్ ఎప్పుడూ ఆధిపత్యం చెలాయించేవాడని చెప్పాడు. ప్రస్తుత క్రికెట్‌లో పలు సందర్భాల్లో విరాట్ కోహ్లీ, బాబర్ ఆజామ్‌లు అచ్చంగా సచిన్ లాగానే అడుతున్నారనే కామెంట్స్ చేశాడు.