బిర్యానీ తినడానికి డబ్బులు లేక ఆలయంలో చోరీ..

|

Sep 28, 2020 | 10:28 PM

బిర్యానీ కోసం దొంగతనాలు..ఔను మీరు వింటున్నది నిజమే. జిహ్వ చాపల్యం ఆపుకోలేక బరితెగించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇది వెలుగుచూసింది.

బిర్యానీ తినడానికి డబ్బులు లేక ఆలయంలో చోరీ..
Follow us on

బిర్యానీ కోసం దొంగతనాలు..ఔను మీరు వింటున్నది నిజమే. జిహ్వ చాపల్యం ఆపుకోలేక బరితెగించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇది వెలుగుచూసింది. ఆలయాల్లో చోరీలపై జిల్లా పోలీసులు సీరియస్‌గా స్పందిస్తున్నారు. ఇటీవల ఓ గుడిలో చోరీకి పాల్పడ్డ ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. వీరు కేవలం బిర్యానీ తినడానికి డబ్బులు లేక చోరీలకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.

ప్రార్థనా మందిరాల్లో నెలరోజుల లోపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు ఆదేశించారు. అలాగే హిందూ దేవాలయాల్లో రథాలకు తగిన భద్రత కల్పించాలని సూచించారు. ప్రతీ ఏడాది వివిధ ఆలయాల్లో చోరీలు జరగడం, ఆయా కేసుల్లో నిందితులను అదుపులోకి తీసుకోడం సహజంగా జరిగేదే అంటున్నారు పోలీసులు. అయితే – కొందరు ఈ ఘటనలకు రాజకీయ రంగు పులుముతుండటం సరికాదన్నారు పశ్చిమగోదావరి జిల్లా ఎస్‌.పి. నారాయణనాయక్‌.