రాష్ట్రపతి పాలన దిశగా.. వెస్ట్ బెంగాల్..?

ధర్నాలు, ర్యాలీలతో వెస్ట్ బెంగాల్ రావణ కాష్టంలో మారింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా.. టీఎంసీ, బీజేపీ మధ్య మాటల, మంటల యుద్ధం ఆగడంలేదు. బెంగాల్లో తమ కార్యకర్తలపై జరగుతున్న రాజకీయ దాడులను నిరసిస్తూ.. బుధవారం బీజేపీ ర్యాలీ తీసింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ ర్యాలీపై పోలీసులు లాఠీ ఛార్జీకి దిగారు. అయితే ఇప్పటికే ఎన్నికల తర్వాత జరిగిన హింసలో దాదాపు 15 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ […]

రాష్ట్రపతి పాలన దిశగా.. వెస్ట్ బెంగాల్..?
TV9 Telugu Digital Desk

| Edited By:

Jun 13, 2019 | 8:24 AM

ధర్నాలు, ర్యాలీలతో వెస్ట్ బెంగాల్ రావణ కాష్టంలో మారింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా.. టీఎంసీ, బీజేపీ మధ్య మాటల, మంటల యుద్ధం ఆగడంలేదు. బెంగాల్లో తమ కార్యకర్తలపై జరగుతున్న రాజకీయ దాడులను నిరసిస్తూ.. బుధవారం బీజేపీ ర్యాలీ తీసింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ ర్యాలీపై పోలీసులు లాఠీ ఛార్జీకి దిగారు.

అయితే ఇప్పటికే ఎన్నికల తర్వాత జరిగిన హింసలో దాదాపు 15 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ కమలాపాటి త్రిపాఠి అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చారు. ఇవాళ జరిగే ఈ భేటీలో పలు కీలక అంశాలపై గవర్నర్ చర్చించే అవకాశాలున్నాయి. అటు గవర్నర్ భేటీపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గవర్నర్ అఖిలపక్ష భేటీలో వివిధ పార్టీల నేతలతో హింసపై చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. దాని పరిణామాల తర్వాత కేంద్రానికి రిపోర్టు ఇవ్వనున్నారు. ఆ రిపోర్టు ఆధారంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందనే ప్రచారం జరుగుతోంది.

అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా బెంగాల్ – నాన్ బెంగాలీ యుద్ధంగా మార్చిన మమతా బెనర్జీ.. హిందూ ఓటు బ్యాంకును సంఘటితం చేస్తోంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో మరింత ఉద్రిక్తతలు తలెత్తాయి. ప్రతిరోజు ఎక్కడో ఓ చోట హింసతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం బీజేపీ ర్యాలీ చేపట్టింది. ఎన్నికల్లో గెలిచిన 18 మంది ఎంపీలు, రాష్ట్ర ఇన్ ఛార్జీ కైలాష్ విజయవర్గీయులు, దిలీప్ ఘోష్, ముకుల్ రాయ్ సహా ఇతర బీజేపీ నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

మమత సర్కార్ కు వ్యతిరేకంగా నినదిస్తున్న బీజేపీ శ్రేణులపై లాఠీలు విరిగాయి. భాష్పవాయు ప్రయోగం జరిగింది. వెల్లింగ్టన్ ప్రాంతం నుంచి పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు ఉన్న లాల్ బజార్ దాకా నిరసన ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించుకున్నప్పటికీ.. బౌ బజార్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నేతలు ముకుల్ రాయ్, రాజూ బెనర్జీ లాఠీ చార్జీలో గాయపడ్డారు. దీంతో తీవ్ర స్థాయి వీధిపోరాటం బెంగాల్‌లో సాగుతున్న రాజకీయ యుద్ధాన్ని ప్రతిబింబించింది. ఇది ప్రజాస్వామ్య హననం అంటూ కమలనాథులు మండిపడుతున్నారు. ఈ పోరాటం ఆపబోమని.. ఇది ప్రారంభం మాత్రమేనని పిలుపునిచ్చారు.

అయితే ఈ పరిస్థితులను చూసిన గవర్నర్.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం రావచ్చని వెల్లడించారు. హింస రోజు రోజుకి పెరుగుతున్నప్పుడు ఆర్టికల్ 356ని ప్రయోగించే పరిస్థితి వస్తుందన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu