తెలుగురాష్ట్రాలకు వాతావరణ సూచన.. అల్పపీడన సంకేతం

|

Sep 18, 2020 | 9:37 PM

ఉత్తర.. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో శుక్ర, శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలుగురాష్ట్రాలకు వాతావరణ సూచన.. అల్పపీడన సంకేతం
Follow us on

ఉత్తర.. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో శుక్ర, శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు. తెలంగాణ, విదర్భ ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని పేర్కొన్నారు. ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒరిస్సా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 km ఎత్తు దగ్గర ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపారు. ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గర నైరుతి బంగాళాఖాతంలో 7.6 km ఎత్తు దగ్గర ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించారు. ఈశాన్య బంగాళాఖాతంలో సెప్టెంబరు 20వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని సూచించారు.