క‌రోనా కట్టడికి.. ఒక‌టి క‌న్నా ఎక్కువ టీకాలు అవ‌స‌రం..!

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో క‌రోనా నియంత్ర‌ణ‌కు ఒక‌టి క‌న్నా ఎక్కువ టీకాలు అవ‌స‌రమ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 180కిపైగా క‌రోనా వ్యాక్సిన్ల ప‌రిశోధ‌న‌లు

క‌రోనా కట్టడికి.. ఒక‌టి క‌న్నా ఎక్కువ టీకాలు అవ‌స‌రం..!

Edited By:

Updated on: Jul 31, 2020 | 11:38 PM

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో క‌రోనా నియంత్ర‌ణ‌కు ఒక‌టి క‌న్నా ఎక్కువ టీకాలు అవ‌స‌రమ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 180కిపైగా క‌రోనా వ్యాక్సిన్ల ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇందులో 26 టీకాలు మాన‌వుల‌పై ప్ర‌యోగ ద‌శ‌కు చేరుకున్నాయి. కాగా, వైర‌స్ ప‌లు దేశాల్లో ప‌లు విధాలుగా మార్పులు చెందుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచవ్యాప్తంగా క‌రోనా నియంత్ర‌ణ‌కు ఒక‌టి క‌న్నా ఎక్కువ టీకాలు అవ‌స‌ర‌మ‌ని అమెరికన్ ఇమ్యునోలజిస్ట్, యు.ఎస్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అధిపతి ఆంథోనీ ఫౌసీ తెలిపారు.

ప్రస్తుతం 4 కంపెనీల వ్యాక్సిన్లు ట్ర‌య‌ల్స్ చివ‌రి ద‌శ‌లో ఉన్న‌ట్లు ఫౌసీ వెల్ల‌డించారు. అవి అమెరికాలోని మోడెర్నా ఇంక్, ఆక్స్‌ఫ‌ర్డ్-ఆస్ట్రాజెనెకా, చైనీస్ కంపెనీ సినోఫార్మ్, చైనీస్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం సినోవాక్ గా తెలుస్తోంది. సాధార‌ణంగా ఒక టీకా అభివృద్ధికి సుమారు ప‌ది ఏండ్ల స‌మ‌యం ప‌డుతుందని, అయితే క‌రోనా వ్యాప్తిలోకి వ‌చ్చిన ఏడు నెల‌ల్లోనే వ్యాక్సిన్ ప్ర‌యోగాలు కీల‌క ద‌శ‌కు చేరుకున్నాయ‌ని తెలిపారు. మాన‌వుల‌పై ప్ర‌యోగాలు మూడో ద‌శ‌కు చేరుకున్న నేప‌థ్యంలో ఈ ఏడాది చివ‌రిక‌ల్లా క‌రోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశ‌మున్న‌ద‌ని ఫౌసీ చెప్పారు.

Read More:

నర్సులకు భారీ ఆఫర్లు.. విమానచార్జీలు.. 50 వేల జీతం..!

ఇంటర్ సెకండియర్‌ విద్యార్థులందరూ పాస్‌.. అందుబాటులో మెమోలు..!