కరోనాతో కలిసి జీవించాలి…సేమ్ జ‌గ‌న్ మాటే చెప్పిన కేంద్రం ..

క‌రోనాకు మెడిసిన్ కానీ, వ్యాక్సిన్ కానీ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ వైర‌స్ తో కొంత‌కాలం జీవించాల్సిన ప‌రిస్థితులు త‌ప్ప‌వు. కొన్ని రోజుల క్రితం క‌రోనాపై ప్రెస్ మీట్ లో సీఎం చేసిన వ్యాఖ్య‌లు ఇవి. ఈ మాట‌లు అన్నందుకు సీఎం జ‌గ‌న్ పై ప్ర‌తిప‌క్షాలు తీవ్ర స్థాయిలో ఫైరయ్యాయి. అయితే ఆ త‌ర్వాతికాలంలో అనూహ్య‌గా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త […]

కరోనాతో కలిసి జీవించాలి...సేమ్ జ‌గ‌న్ మాటే చెప్పిన కేంద్రం ..

Updated on: May 08, 2020 | 6:36 PM

క‌రోనాకు మెడిసిన్ కానీ, వ్యాక్సిన్ కానీ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ వైర‌స్ తో కొంత‌కాలం జీవించాల్సిన ప‌రిస్థితులు త‌ప్ప‌వు. కొన్ని రోజుల క్రితం క‌రోనాపై ప్రెస్ మీట్ లో సీఎం చేసిన వ్యాఖ్య‌లు ఇవి. ఈ మాట‌లు అన్నందుకు సీఎం జ‌గ‌న్ పై ప్ర‌తిప‌క్షాలు తీవ్ర స్థాయిలో ఫైరయ్యాయి. అయితే ఆ త‌ర్వాతికాలంలో అనూహ్య‌గా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కూడా సేమ్ కామెంట్స్ చేశారు.

గత 24 గంటల్లో ఇండియాలో నమోదైన‌ కరోనా కేసులు, మరణాలు సహా ఇతర వివ‌రాల‌ను తెలిపిన‌ లవ్ అగర్వాల్…. మనం లాక్‌డౌన్ సడలింపులు, వలస కూలీల‌ను వారి సొంత ప్రాంతాలకు పంపడం గురించి మాట్లాడుతున్నప్పుడు… మనం వైరస్‌తో కలిసి జీవించాలనే విషయాన్ని కూడా గుర్తంచుకోవాలి అని పేర్కొన్నారు. క‌రోనా క‌ట్ట‌డి చర్య‌ల్లో భాగంగా కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలకు తగినట్లుగా ప్ర‌జ‌లంతా అలవాట్లలో మార్పులు చేసుకోవాలని లవ్ అగర్వాల్ సూచించారు.