ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాగ్‌రాజ్ పర్యటనలో ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. అనుకోకుండా జరిగిన ఘటన అందరిని అబ్బుర పరిచింది. అంతేకాదు..దివ్యాంగుల్లో ఉన్న ప్రతిభ, వారి పట్ల ప్రధానికున్న మానవతదృపకథాన్ని కళ్లకు కట్టేలా చేసింది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందనే కదా మీ సందేహాం..వివరాల్లోకి వెళితే…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రయాగ్‌రాజ్‌కి చెందిన ఓ అంధ యువకుడు సెల్ఫీ తీసుకుని ఆయనను ఆబ్బురపరిచాడు. దివ్యాంగుల సహాయార్థం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సహాయక వస్తువుల కొనుగోలు, అందజేత పథకం (ఏడీఐపీ) కింద ఇచ్చిన స్మార్ట్‌ఫోన్‌తో సదరు యువకుడు సెల్ఫీ తీసుకున్నాడు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన సామాజిక్ అధికర్త శిబిరంలో ప్రధాని పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులు, వృద్ధుల సహాయార్థం చేపట్టిన అతి పెద్ద సహాయక శిబిరం ఇదేనని పేర్కొన్నారు. ‘‘వారికి మెరుగైన జీవితం అందించేందుకు మేము చేస్తున్న కృషిలో ఇదో భాగం’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఇదే కార్యక్రమంలో ప్రధానమంత్రి పలువురు వయో వృద్ధులకు సహాయక ఉపకరణాలను అందజేశారు. అనంతరం యూపీలోని చిత్రకూట్‌లో బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేకి శంకుస్థాపన చేశారు.