CM Jagan: “కేంద్రంలో NDAకి పూర్తి మెజారిటీ రాకపోతే..” సీఎం జగన్ కీలక కామెంట్స్

విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్ వైభవానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నామన్నారు. శాశ్వతంగా ఇనుప ఖనిజం గనులు కేటాయింపుతో ప్లాంట్ పరిస్థితి మెరుగుపడుతుంది. మిగతా అంశాలు దీనివల్ల పరిష్కారమవుతాయని ధీమా వ్యక్తం చేశారు. నైతికత, విలువలను విడిచిపెట్టి.. ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో వారి వైఖరి ఏంటో బయటపడిందన్నారు.

CM Jagan: కేంద్రంలో NDAకి పూర్తి మెజారిటీ రాకపోతే.. సీఎం జగన్ కీలక కామెంట్స్
Cm Ys Jagan
Follow us

|

Updated on: Apr 23, 2024 | 3:19 PM

విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులకు వైసీపీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు సీఎం జగన్. ఈ సమస్యపై మొదటిసారిగా కార్మికుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే గళమెత్తిందన్నారు. పలు సూచనలతో ప్రధానికి లేఖ కూడా రాశామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ విషయంలో వైసీపీది రాజీలేని ధోరణి అంటూ కార్మికులకు చెప్పుకొచ్చారు సీఎం జగన్. కేంద్ర ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి తీసుకు వస్తూనే ఉన్నామన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్ వైభవానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నామన్నారు. శాశ్వతంగా ఇనుప ఖనిజం గనులు కేటాయింపుతో ప్లాంట్ పరిస్థితి మెరుగుపడుతుంది. మిగతా అంశాలు దీనివల్ల పరిష్కారమవుతాయని ధీమా వ్యక్తం చేశారు. నైతికత, విలువలను విడిచిపెట్టి.. ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో వారి వైఖరి ఏంటో బయటపడిందన్నారు. ఈ ఎన్నికల్లో కార్మికుల మద్దతు కోరే నైతికత వైసీపీకి మాత్రమే ఉందన్నారు. కూటమి గెలిస్తే కార్మిక లోకం ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉందనే సంకేతం వెళ్తుంది కాబట్టి విశాఖలో వైసీపీ అభ్యర్థులకు అండగా నిలవాలని కోరారు సీఎం జగన్. కేంద్రంలో ఎన్డీయేకి పూర్తి స్థాయిలో మెజార్టీ రాకపోతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతానని హామీ ఇచ్చారు సీఎం జగన్.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమనీ, స్టీల్ ప్లాంట్ పై తమ వైఖరిలో ఏ మార్పు లేదన్నారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌. తాము అంగీకారం తెలపనందునే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని సీఎం చెప్పినట్లు అమర్‌నాథ్‌ చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…