నా తండ్రిని లంచం అడిగారు.. విరాట్ సంచలన నిజాలు వెల్లడి..

|

May 21, 2020 | 12:27 AM

మన దేశంలో ఫైల్ కదలాలన్నా.. ఏదైనా కాలేజీలో సీట్ పొందాలన్నా.. అధికారుల చెయ్యి తడపాల్సిందే. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా భారతదేశంలో ఈ అవినీతిని నిర్మూలించలేకపోతున్నాయి. పేదోడు దగ్గర నుంచి పెద్దోడు వరకు అందరూ కూడా దీని బారిన పడ్డవారే. ఈ అవినీతి అన్ని రంగాలకు పాకింది. ముఖ్యంగా క్రీడా రంగంలో పైసా లేనిదే రంజీ జట్టులో కూడా చోటు దక్కదు. దీని వల్ల ఎందరో అద్భుతమైన ఆటగాళ్లు కనుమరుగయ్యారు. ఇక ప్రస్తుత భారత జట్టు సారధి విరాట్ […]

నా తండ్రిని లంచం అడిగారు.. విరాట్ సంచలన నిజాలు వెల్లడి..
Follow us on

మన దేశంలో ఫైల్ కదలాలన్నా.. ఏదైనా కాలేజీలో సీట్ పొందాలన్నా.. అధికారుల చెయ్యి తడపాల్సిందే. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా భారతదేశంలో ఈ అవినీతిని నిర్మూలించలేకపోతున్నాయి. పేదోడు దగ్గర నుంచి పెద్దోడు వరకు అందరూ కూడా దీని బారిన పడ్డవారే. ఈ అవినీతి అన్ని రంగాలకు పాకింది. ముఖ్యంగా క్రీడా రంగంలో పైసా లేనిదే రంజీ జట్టులో కూడా చోటు దక్కదు. దీని వల్ల ఎందరో అద్భుతమైన ఆటగాళ్లు కనుమరుగయ్యారు. ఇక ప్రస్తుత భారత జట్టు సారధి విరాట్ కోహ్లి.. తనను ఢిల్లీ జట్టుకు ఎంపిక చేసుకోవడం కోసం తన తండ్రిని లంచం అడిగారని సంచలన నిజాలు వెల్లడించాడు.

భారత స్టార్ ఫుట్ బాలర్ సునీల్ ఛత్రీతో ఇటీవల చేసిన ఇన్‌స్టా లైవ్‌లో తన జీవితంలో జరిగిన కొన్ని చేదు సంఘటనలను విరాట్ కోహ్లి పంచుకున్నాడు. తనను ఢిల్లీ జట్టు సెలక్షన్ చేసే క్రమంలో ఎవరో వ్యక్తి తన తండ్రిని లంచం అడిగారని.. కానీ అందుకు తన తండ్రి అసలు ఒప్పుకోలేదని విరాట్ చెప్పాడు.

మెరిట్ ప్రకారం తన కొడుకును సెలెక్ట్ చేయండి.. నేనైతే ఒక్క రూపాయి కూడా ఇవ్వనని తన తండ్రి తేల్చి చెప్పారని కోహ్లీ తెలిపాడు. తన తండ్రి తనకు సూపర్ హీరో అని.. ఎప్పుడూ ప్రతిభను నమ్ముకోవాలని.. ఎవరి మీదా ఆధారపడవద్దని తన తండ్రి చెప్పినట్లు వివరించాడు. నాన్న తీసుకున్న నిర్ణయాల వల్లే తన కెరీర్ ఇంత సులభంగా సాగిందని స్పష్టం చేశాడు. ఇప్పుడు తాను ఈ స్థాయిలో ఉన్నానంటే.. అదంతా తన తండ్రి వల్లే సాధ్యమైందని విరాట్ వెల్లడించాడు.

Read More:

షాకింగ్: కరోనా వ్యాక్సిన్ ప్రయోగం విఫలం.. ఇక కష్టమేనా!

10, 12వ తరగతి పరీక్షలు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూల్స్ ఇవే..

రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం..

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఓఆర్​ఆర్​పై వాహనాలకు అనుమతి…

మందుబాబులకు గుడ్ న్యూస్.. స్విగ్గీ, జొమాటోలో లిక్కర్ డెలివరీ..

కిమ్‌ను బీట్ చేసిన మోదీ.. ప్రపంచంలోనే మూడోస్థానం..

హైకోర్టు సంచలన తీర్పు.. మైనర్ అబార్షన్‌కు అనుమతి…