ఈజిప్టులో చెక్కుచెదరని అలనాటి మమ్మీ శవపేటిక

ఈజిప్టులో సుమారు 2,500 సంవత్సరాల క్రితం సీల్ చేసిన పురాతన ముమ్మిఫైడ్ శవపేటికను శనివారం తెరిచారు. ఆర్కియాలజిస్టులు, స్థానికులు ఇందులో  చెక్కుచెదరని మమ్మీని చూసి ఆశ్చర్యపోయారు.

  • Umakanth Rao
  • Publish Date - 12:53 pm, Tue, 6 October 20
ఈజిప్టులో చెక్కుచెదరని అలనాటి మమ్మీ శవపేటిక

ఈజిప్టులో సుమారు 2,500 సంవత్సరాల క్రితం సీల్ చేసిన పురాతన ముమ్మిఫైడ్ శవపేటికను శనివారం తెరిచారు. ఆర్కియాలజిస్టులు, స్థానికులు ఇందులో  చెక్కుచెదరని మమ్మీని చూసి ఆశ్చర్యపోయారు. సిల్క్ లాంటి బట్టలో భద్రంగా చుట్టి ఉన్న శవం మహిళదిగా భావిస్తున్నారు. సకారా ప్రాంతంలో పురాతత్వ  శాఖ అధికారులు తవ్వకాలు జరిపినప్పుడు చెక్కతో చేసిన 59 శవపేటికలు బయటపడ్డాయి. వాటిలో ఇది ఒకటి. మిగిలినవాటిని కూడా ఓపెన్ చేస్తామని అంటున్నారు. నాటి ఈజిప్టు గురువులు, ఇతర ప్రముఖుల మమ్మీలు ఈ పేటికల్లో ఉన్నాయని వారు తెలిపారు.

టూరిజం శాఖ ఈ పేటికను తెరిచిన వీడియోకు సుమారు 90 లక్షల వ్యూస్ వచ్చాయి.  ఇది ఆశ్చర్యకరమైన వీడియో అని, అయినా ఈ కరోనా కాలంలో ఇప్పుడే ఇలాంటి శవపేటికపేటికల్లు తెరవాలా అని కొందరు నెటిజన్లు విసుక్కుంటున్నారు. అత్యంత ప్రాచీన కాలం  నాటివైన ఈ శవపేటికల్లో హానికరమైన బ్యాక్టీరియా గానీ, సూక్ష్మ జీవులు గానీ ఉండవచ్చునని, వాటిని మన రోగనిరోధక శక్తి కూడా ఎదిరించజాలదని వాళ్ళు అంచనా వేస్తున్నారు. మరికొందరు.. ఇలాంటివి తెరిస్తే చావులు, శాపాలు తప్పవేమో అని జోక్ చేస్తున్నారు.