
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికైన మొదటి మహిళగా విని మహాజన్ రికార్డు సృష్టించారు. కరణ్ అవతార్ సింగ్ స్థానంలో ఈమె నియమితులయ్యారు. 1987 బ్యాచ్‌కు చెందిన విని మహాజన్ శుక్రవారం పంజాబ్ సీఎస్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే పంజాబ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పోలీసు, సివిల్ రంగాలకు నేతృత్వం వహిస్తున్నది మహాజన్ దంపతులే కావడం విశేషం.
కాగా.. ఆ రాష్ట్ర డీజీపీ దినకర్ గుప్తా భార్యే నూతన సీఎస్ విని మహాజన్. గత వారం రోజుల నుంచి ఈ నియామకంపై చర్చలు జరగ్గా రెండు రోజుల క్రితమే మహాజన్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సీఎస్‌గా ఉన్న కరణ్ అవతార్ సింగ్ పదవీకాలం ఆగస్టు 31తో ముగియనుంది. అయితే గత కొంత కాలంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కరణ్‌ని పదవిలోంచి తొలగించాలని పలువురు కేబినెట్ మంత్రులు సైతం డిమాండ్ చేస్తూ వస్తున్నారు.