రాశీ, రంభలకు విజయవాడ కోర్టు షాక్..ఇంతకీ ఏమైందంటే?

|

Sep 29, 2019 | 11:43 AM

తెలుగు తెరను ఒకప్పుడు ఏలిన హీరోయిన్స్ రాశి, రంభ. పలు విజయవంతమైన సినిమాలలో నటించి వీరిద్దరూ తెలుగు ప్రజల మనసుల్లో నిలిచిపోయారు. కాగా హీరోయిన్స్‌గా ఫేడ్ అవుట్ అయిన తర్వాత వీరు ‘కలర్స్’ అనే సంస్థలో వెయిట్ లాస్‌కి సంబంధించిన వాణిజ్య ప్రకటనల్లో నటించారు. అవి ఆమోదయోగ్యంగా లేకపోవడం, కష్టమర్లను మభ్యపెట్టేలా ఉన్న నేపథ్యంలో ఆ ప్రకటనలు ప్రసారం చేయోద్దంటూ విజయవాడ వినియోగదారుల ఫోరం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాటిని వెంటనే ఆపేయాలని ఆదేశించింది.  సినితారలతో […]

రాశీ, రంభలకు విజయవాడ కోర్టు షాక్..ఇంతకీ ఏమైందంటే?
Follow us on

తెలుగు తెరను ఒకప్పుడు ఏలిన హీరోయిన్స్ రాశి, రంభ. పలు విజయవంతమైన సినిమాలలో నటించి వీరిద్దరూ తెలుగు ప్రజల మనసుల్లో నిలిచిపోయారు. కాగా హీరోయిన్స్‌గా ఫేడ్ అవుట్ అయిన తర్వాత వీరు ‘కలర్స్’ అనే సంస్థలో వెయిట్ లాస్‌కి సంబంధించిన వాణిజ్య ప్రకటనల్లో నటించారు. అవి ఆమోదయోగ్యంగా లేకపోవడం, కష్టమర్లను మభ్యపెట్టేలా ఉన్న నేపథ్యంలో ఆ ప్రకటనలు ప్రసారం చేయోద్దంటూ విజయవాడ వినియోగదారుల ఫోరం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాటిని వెంటనే ఆపేయాలని ఆదేశించింది.  సినితారలతో ప్రసారమాద్యమాలలో ‘కలర్స్’ సంస్ధ నిర్వహిస్తున్న అన్నీ ప్రకటనలు నిలుపదల చేయాలని కన్జుమర్ కోర్టు తీర్పు ఇచ్చింది.

కలర్స్ వెయిట్ లాస్ ప్రకటనలు చూసి మోసపోయిన వినయోగదారుడు.. ఆ సంస్థకు చెల్లించిన రూ.74,652ల మొత్తాన్ని 9 శాతం వడ్డీతో వెంటనే చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అలాగే వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.2 లక్షలను జరిమానాగా కట్టాలని పేర్కొంది. అంతేకాదు రాశీ, రంభలకు కూడా వార్నింగ్ ఇచ్చింది. సెలబ్రిటీస్ తప్పుడు ప్రకటనలను ప్రోత్సహించడం సరికాదని…జాగ్రత్త వహించని పక్షంలో కొత్త చట్టం ద్వారా వారికి కూడా జరిమానా విధించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది.