ఆస్కార్ బరిలో మలయాళ చిత్రం ‘జల్లికట్టు’, చిత్ర బృందానికి విక్టరీ వెంకటేష్ ప్రశంసలు

|

Nov 26, 2020 | 4:39 PM

భారతీయ చిత్రాలకు, సినిమాల్లోని వివిధ విభాగాలకు ఆస్కార్ అవార్డు దక్కిన సందర్బాలు చాలా తక్కువనే చెప్పాలి. అద్బుతమైన కంటెంట్‌తో సినిమాలు తీస్తున్నప్పటికీ

ఆస్కార్ బరిలో మలయాళ చిత్రం జల్లికట్టు, చిత్ర బృందానికి విక్టరీ వెంకటేష్ ప్రశంసలు
Follow us on

భారతీయ చిత్రాలకు, సినిమాల్లోని వివిధ విభాగాలకు ఆస్కార్ అవార్డు దక్కిన సందర్బాలు చాలా తక్కువనే చెప్పాలి. అద్బుతమైన కంటెంట్‌తో సినిమాలు తీస్తున్నప్పటికీ మన మేకర్స్‌కు ఈ అత్యన్నత అవార్డు అందని ద్రాక్షగానే మారింది. మరికొన్ని సినిమాలు అవార్డు పరిశీలన వరకు వెళ్లినా, ఎంపికవ్వడంలో మాత్రం నిరాశపరిచాయి. కాగా ఈసారి 93వ ఆస్కార్ పురస్కారాలు జరగనున్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో మన దేశం నుంచి ‘జల్లికట్టు’ నామినేట్ అయ్యింది. ఆస్కార్‌ నామినేషన్‌ కోసం భారత్‌లోని వివిధ భాషల  నుంచి 27 చిత్రాలు పరిశీలనకు రాగా వాటిలో నుంచి ‘జల్లికట్టు’ను ఎంపిక చేసినట్లు ఎఫ్‌ఎఫ్‌ఐ జ్యూరీ చైర్మన్‌ రాహుల్‌ రవైల్‌ వెల్లడించారు.

మనుషుల్లోని పశుప్రవృత్తిని రియాల్టీ వేలో చూపించిన ఈ మలయాళ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కాగా ‘జల్లికట్టు’ ఆస్కార్ అవార్డుకు నామినేట్ అవ్వడంపై టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ సంతోషం వ్యక్తం చేశారు. మలయాళ సినీ పరిశ్రమలో సూపర్ టాలెంట్ ఉందని, అక్కడి నుండి మంచి స్టోరీస్ వస్తాయని మరోసారి నిరూపితమైందని చెప్పారు. ‘జల్లికట్టు’ ఆస్కార్ ఎంపిక కావడంపై చాలా హ్యాపీగా ఉందని, చిత్ర బృందానికి తన శుభాకాంక్షలు తెలిపారు వెంకటేష్.

Also Read :

ఏపీపై నివర్ తుఫాన్ ఎఫెక్ట్, పలు జిల్లాల్లో నమోదైన భారీ వర్షపాతం, వివరాలు…

జమిలి ఎన్నికలు భారత్​కు అవసరం, ప్రిసైడింగ్ అధికారుల 80వ సదస్సులో ప్రధాని కీలక వ్యాఖ్యలు

కరోనాపై పోరాడుతూ ముందుకు వెళ్దాం, వైరస్ నియంత్రణ చర్యలకు రూ.50 కోట్లు విడుదల