జీహెచ్ఎంసీలో పెరిగిన ఎన్నికల సందడి

|

Nov 06, 2020 | 10:43 PM

దుబ్బాక ఎలక్షన్ అయిపోయింది ఇప్పుడు అందరిచూపు జీహెచ్ఎంసీ ఎన్నికల పైనే ఉంది. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో క్లారిటీ లేదు కానీ ప్రచారం మాత్రం మొదలయింది. రాత్రి పగలు తేడా లేదు ఓటర్లను ఇప్పటినుండే ప్రసన్నం చేసుకోవడం కోసం అధికారం లో ఉన్నవాళ్లు , ఆశావహులు ప్రచారంలో దిగిపోయారు. దీంతో గ్రేటర్ లో ఎలక్షన్ హీట్ కనిపిస్తోంది.

జీహెచ్ఎంసీలో పెరిగిన ఎన్నికల సందడి
Follow us on

GHMC Election : దుబ్బాక లో ఉప ఎన్నికలు ఎంత కాక రేపాయో చూశాం. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటాలని పోటీ పడుతున్నాయి రాజకీయ పార్టీలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా గా తమ ప్రచారాన్ని ప్రారంభించాయి. ఎలక్షన్ ఎప్పుడు జరుగుతాయి అనేది ఇంకా సరైన క్లారిటీ లేదు అయిన సరే ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవాలని తమదైన ప్రణాళికతో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. తమకు సంబంధించిన నియోజకవర్గాలలో ప్రజలు బాగోగులు తెలుసుకుంటూ ప్రసన్నం చేసుకోవడానికి చూస్తున్నారు

ప్రజలు తమ వైపే ఉన్నారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆయా పార్టీల నేతలు. చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ అధికార పార్టీ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తే… ప్రతిపక్ష పార్టీలు తాము చేయబోయే అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తూనాయి.

మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని అభ్యర్ధులు ఆల్రెడీ అధికారం ఉన్న నేతలు. ఈసారి అవకాశం ఇస్తే తమ సత్తా చూపిస్తామని అంటున్నారు మిగిలిన అభ్యర్థులు.  అమావాస్యకు, పున్నానికి వచ్చే నేతలు ఎలక్షన్ లు వస్తేనే తమ గల్లీలో కనిపిస్తారని అంటున్నారు నగర ప్రజలు.

లేకపోతే కనీసం పత్తా కూడా పట్టరని మండిపడుతున్నారు. గల్లీలో పండగ వాతావరణం కనిపిస్తుంది.. ఇంతకీ ముందు కనిపించని వారు సైతం యోగ క్షేమాలు అడుగుతున్నారని ఇది మాకు మాములే అని అంటున్నారు సరదాగా తీసుకుంటున్నారు భాగ్యనగర్ వాసులు.

మరో వైపు సోషల్ మీడియానే ప్రధాన ప్రచార అస్త్రంగా రెడీ చేసుకుంటుంన్నారు. ఇప్పటికే టీమ్స్ లను ఏర్పాటు చేసుకుని ప్రచారం చేస్తున్నారు. ఒకరి మరొకరి తప్పు ఒప్పులను ప్రజలకు సోషల్ మీడియా ద్వారా తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాదు ఇంకా నాయకుల పేర్లతో పాటలకు కూడా రంగం సిద్దమవుతోంది… ఏదీ ఏమైనప్పటికి సిటీ లో ఓట్ల పండగ కల అప్పుడే వొచ్చినట్టుగా కనిపిస్తుంది.