తిరుమల శ్రీ వరాహస్వామివారి ఆలయంలో గురువారం బాలాలయ సంప్రోక్షణము సందర్భంగా శ్రీ వరాహస్వామివారు తిరు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించారు. సాధారణంగా సంవత్సరంలో వరహ జయంతి రోజు మాత్రమే వరాహస్వామి భక్తులకు దర్శనమిస్తారు. ప్రస్తుతం వరహాస్వామి ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు ప్రారంభించేందుకు బాలాలయ మహాసంప్రోక్షణ నిర్వహించింది టీటీడీ. ఈరోజు పూర్ణాహుతితో మహా సంప్రోక్షణ కార్యక్రమం ముగియడంతో వరాహస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగారు.