డెహ్రాడూన్‌లో 48 గంటల లాక్‌డౌన్

|

Jun 20, 2020 | 3:33 PM

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో 48 గంటల లాక్‌డౌన్ విధించినట్టు డెహ్రాడూన్ సిటీ ఎస్‌.పి. శ్వేతా చౌదరి శనివారం ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం మొదలైన లాక్‌డౌన్ సోమవారం ఉదయం 7 గంటల వరకు కొనసాగనుంది.

డెహ్రాడూన్‌లో 48 గంటల లాక్‌డౌన్
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. లాక్ డౌన్ సడలింపులతో కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండడంతో మరోసారి నిబంధనలు కఠినతరం చేస్తున్నాయి అయా రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో రెండో దఫా లాక్ డౌన్ విధించింది. తాజాగా ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో 48 గంటల లాక్‌డౌన్ విధించినట్టు డెహ్రాడూన్ సిటీ ఎస్‌.పి. శ్వేతా చౌదరి శనివారం ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం మొదలైన లాక్‌డౌన్ సోమవారం ఉదయం 7 గంటల వరకు కొనసాగనుంది. 48 గంటల పాటు అమలులో ఉండే సమయంలో నిత్యావసర వస్తువుల అమ్మకాలను మాత్రం అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,177 కేసులు నమోదు కాగా, వీటిలో 718 యాక్టివ్ కేసులున్నాయి. 1,433 మంది కోలుకున్నారు. కరోనా ధాటికి ఇప్పటి వరకు 26 మరణించినట్లు అధికారులు తెలిపారు.