టిక్‌ టాక్‌పై యూఎస్ సెనేటర్ల ఆందోళన

|

Jul 29, 2020 | 10:35 PM

సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ అమెరికా ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉందని పలువురు యూఎస్ సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ ల్యాండ్ సెక్యూరిటీకి ఏడుగురు సెనేటర్లు ఓ లేఖ రాశారు.

టిక్‌ టాక్‌పై యూఎస్ సెనేటర్ల ఆందోళన
Follow us on

టిక్ టాక్… ప్రపంచాన్ని శాసిస్తోంది. సరిగా వినియోగిస్తే ప్రతిభకు పట్టం కడుతుంది… లేదంటే లైఫ్ ను నాశనం చేస్తుంది. లాక్ డౌన్ సమయంలో జనం ఇంట్లో తెగ ఈ యాప్ ద్వారా తెగ ఎంజాయ్ చేశారు. అయితే, ఈ సోషల్ మీడియా టిక్‌టాక్‌ యాప్ అమెరికా ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉందని పలువురు యూఎస్ సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ ల్యాండ్ సెక్యూరిటీకి ఏడుగురు సెనేటర్లు ఓ లేఖ రాశారు. టిక్‌టాక్‌ను అడ్డుపెట్టుకొని చైనాలోని కమ్యూనిస్టు పార్టీ అమెరికా ఎన్నికలను ప్రభావితం చేస్తుందని వారు ఆరోపించారు. ప్రజల్లో అసంతృప్తులు సృష్టించి తమకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం గెలిచేలా చైనా కుట్ర పన్నే అవకాశం ఉందని హెచ్చరించారు. అమెరికా రాజకీయాలపై ప్రభావితం చేసే అవకాశమున్న టిక్ టాక్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సెనేటర్లు డిమాండ్ చేశారు. చైనా కుయుక్తులకు అడ్డుకట్టవేయాలని లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు, ఇప్పటికే భారత ప్రభుత్వం టిక్‌టాక్‌ను బ్యాన్ చేసింది. అటు, ఆస్ట్రేలియన్లు కూడా టిక్‌ టాక్‌తో డేటా చోరీ ముప్పుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తూ ఆస్ట్రేలియా అసెంబ్లీ ఎమ్మెల్యేలు టిక్‌ టాక్‌ను నిషేధించాలని ప్రతిపాదిస్తున్నారు.