Uppena Movie : తీరాన్ని తాకడానికి సిద్దమైన ‘ఉప్పెన’.. టీజర్ రిలీజ్ చేయనున్న చిత్రయూనిట్

|

Jan 12, 2021 | 8:58 PM

మెగా ఫ్యామిలీనుంచి వస్తున్న మరో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్. ఈ కుర్రహీరో ఉప్పెన సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనున్నాడు...

Uppena Movie : తీరాన్ని తాకడానికి సిద్దమైన ఉప్పెన.. టీజర్ రిలీజ్ చేయనున్న చిత్రయూనిట్
Follow us on

Uppena Movie : మెగా ఫ్యామిలీనుంచి వస్తున్న మరో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్. ఈ కుర్రహీరో ఉప్పెన సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనున్నాడు. మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించగా.. యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది.

కరోనా అడ్డురాకుండా ఉండి ఉంటే ఈ మూవీ ఈపాటికి ప్రేక్షకుల ముందుకు వచ్చేసేది. లాక్ డౌన్ టైం లో చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి కానీ’ఉప్పెన’ మాత్రం ఓటీటీకి నో చెప్పింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బుధవారం సాయంత్రం 4.05 గంటలకు ఉప్పెన టీజర్ తీరాన్ని తాకనుందని తెలియజేస్తూ ట్విటర్ లో పోస్ట్ పెట్టారు బీఏ రాజు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది.