UP Sonbhadra: తూచ్! యూపీలో గోల్డ్ గనులు లేవట.. ఉన్న బంగారం ఎంతంటే.?

కేజీఎఫ్ బంగారు గనుల మాదిరిగా ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో మొత్తం 3 వేల టన్నుల మేర బంగారం నిక్షేపాలు ఉన్నాయని తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇక దానిపై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ) వివరణ ఇచ్చింది. తమకు ఆ ప్రకటన సంబంధం లేదని తేల్చి చెప్పింది.

UP Sonbhadra: తూచ్! యూపీలో గోల్డ్ గనులు లేవట.. ఉన్న బంగారం ఎంతంటే.?
Follow us

|

Updated on: Feb 23, 2020 | 2:41 PM

UP Sonbhadra: కేజీఎఫ్ బంగారు గనుల మాదిరిగా ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో మొత్తం 3 వేల టన్నుల మేర బంగారం నిక్షేపాలు ఉన్నాయని తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇక దానిపై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ) వివరణ ఇచ్చింది. తమకు ఆ ప్రకటన సంబంధం లేదని తేల్చి చెప్పింది.

Also Read: ట్రెండీ ‘ఐస్‌క్రీమ్ దోశ’.. టేస్ట్‌కు జనాలు ఫిదా..

ఆ జిల్లాకు చెందిన మైనింగ్ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘తమ నుంచి అలాంటి ప్రకటన ఏమి రాలేదని.. మీడియాలో వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవాలేనని వెల్లడించారు. సోన్‌భద్ర జిల్లాలో భారీగా బంగార నిల్వలు లేవు. అక్కడ ఎక్కువగా ఖనిజాలు దొరుకుతాయి. ప్రతీ టన్ను ఖనిజాలకు 3.03 గ్రాముల బంగారం వెలువడుతుంది. అంటే సుమారుగా 52,806 టన్నుల ముడి ఖనిజం బయటికి వస్తే.. 160 కిలోల బంగారం వస్తుంది. అయితే మీడియాలో మాత్రం 3,350 టన్నులు అని వార్తలు వచ్చాయంటూ జీఎస్‌ఐ డైరెక్టర్ జనరల్ ఎం శ్రీధర్ తెలిపారు.

Also Read: Whatsapp Groups Leak In Google Search

Also Read: నన్ను చంపేయ్ అమ్మా.. 9 ఏళ్ళ చిన్నారి ఆవేదన.. వీడియో వైరల్..