యూపీలో ప్రియాంక గాంధీ అరెస్ట్.. ఎందుకో తెలుసా..?

| Edited By:

Jul 19, 2019 | 1:03 PM

ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలోని నారాయణపూర్‌లో బుధవారం జరిగిన కాల్పుల్లో మరణించిన కుటుంబసభ్యులను పరామర్శించడానికి వెళ్లిన ప్రియాంక గాంధీని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ కొనసాగుతున్నందున ఎలాంటి పర్యటనలను అనుమతించబోమని నారాయణపూర్ పోలీసులు ఆమెతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అందోళనకు దిగారు. శాంతి పూర్వకంగానే వారిని కలిసేందుకు వచ్చామని కాకపోతే […]

యూపీలో ప్రియాంక గాంధీ అరెస్ట్.. ఎందుకో తెలుసా..?
Follow us on

ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలోని నారాయణపూర్‌లో బుధవారం జరిగిన కాల్పుల్లో మరణించిన కుటుంబసభ్యులను పరామర్శించడానికి వెళ్లిన ప్రియాంక గాంధీని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ కొనసాగుతున్నందున ఎలాంటి పర్యటనలను అనుమతించబోమని నారాయణపూర్ పోలీసులు ఆమెతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అందోళనకు దిగారు. శాంతి పూర్వకంగానే వారిని కలిసేందుకు వచ్చామని కాకపోతే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదని ప్రియాంక గాంధీ అన్నారు. సోంభద్ర సమీపంలోని యాగ్య దత్ అనే వ్యక్తి భూమిని కొందరు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగానే గొడవలు చెలరేగాయి. ఇరు గ్రూపులు తుపాలకులతో ఒకరినొకరు కాల్చుకున్నారు. ఈ కాల్పుల్లో 10 మంది మృతి చెందారు.