లడఖ్‌లో కంపించిన భూమి.. రిక్టర్ స్కేల్ పై 5.4గా నమోదు

|

Sep 25, 2020 | 6:46 PM

గత కొంత కాలంగా భారత్ చైనా సరిహద్దులో ఉద్రిక్తతల్లో వణికిన లడాఖ్ తాజాగా భూకంపంతో షేక్ అయ్యింది. శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన భూకంపం లడఖ్‌ను కుదిపేసింది.

లడఖ్‌లో కంపించిన భూమి.. రిక్టర్ స్కేల్ పై 5.4గా నమోదు
Earthquake
Follow us on

గత కొంత కాలంగా భారత్ చైనా సరిహద్దులో ఉద్రిక్తతల్లో వణికిన లడాఖ్ తాజాగా భూకంపంతో షేక్ అయ్యింది. శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన భూకంపం లడఖ్‌ను కుదిపేసింది. దీని తీవ్రత భూకంప రిక్టర్ స్కేల్ పై 5.4గా నమోదైంది. శుక్రవారం మధ్యాహ్నం 4:27 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్రకటించింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ, అస్తి నష్టం సంభవించలేదని అధికారలు తెలిపారు. లేహ్ నుంచి 129 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉందని తెలిపింది. 10 కిలోమీటర్ల లోతులో ఇది ప్రారంభమైందని వెల్లడించింది.లేహ్‌లోని స్థానికులు మాత్రం కొన్ని ప్రాంతాల్లో భూకంపానికి భవనాల గోడలు పగిలినట్లు కనిపించిందని తెలిపారు. ఇదిలావుంటే గత బుధవారం జమ్మూ కశ్మీరులోని శ్రీనగర్‌లో రిక్టర్ స్కేల్ పై 3.6 తీవ్రతగల భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.