అప్పడాలు తినండి…కరోనాను తరిమేయండి!

కరోనా మహమ్మారే కాదు, దాని జేజేమ్మ కూడా మనల్ని ఏమీ చేయలేదిప్పుడు...రెండు మూడు భాబీజీ పాపడ్‌లు తింటే సరిపోతుంది! ఈ మాటన్నది సాక్షాత్తు కేంద్రమంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌... కరోనా విరుగుడు వ్యాక్సిన్‌ కోసం ప్రపంచమంతా ఆపసోపాలు పడుతుంటే ఆయనేమో పాపడ్‌ తింటే వైరస్‌ పరార్‌ అంటున్నారు..

అప్పడాలు తినండి...కరోనాను తరిమేయండి!

Updated on: Jul 24, 2020 | 4:07 PM

కరోనా మహమ్మారే కాదు, దాని జేజేమ్మ కూడా మనల్ని ఏమీ చేయలేదిప్పుడు…రెండు మూడు భాబీజీ పాపడ్‌లు తింటే సరిపోతుంది! ఈ మాటన్నది సాక్షాత్తు కేంద్రమంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌… కరోనా విరుగుడు వ్యాక్సిన్‌ కోసం ప్రపంచమంతా ఆపసోపాలు పడుతుంటే ఆయనేమో పాపడ్‌ తింటే వైరస్‌ పరార్‌ అంటున్నారు..ఆయన చెప్పిన ఈ రెండు ముక్కలే ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి…జలవనరులు, గంగా ప్రక్షాళన, పార్లమెంటరీ మంత్రిత్వ శాఖలను నిర్వర్తిస్తున్న ఈ మంత్రివర్యులు ఈ వీడియోలో పాపడ్‌ను చూపిస్తూ కనిపించారు…కనిపించడమే కాదు ఈ పాపడ్‌లు కరోనాతో పోరాడే యాంటీ బాడీలను తయారు చేస్తాయని చెప్పుకొచ్చారు..దాంతో పాటు భాబీజీ పాపడ్‌ ఉత్పత్తిదారులపై అభినందనలు, ప్రశంసలు కురిపించారు కూడా! కేంద్రమంత్రే అంతమాటన్నాక కంపెనీ మాత్రం ఊరుకుంటుందా? తమ ఉత్పత్తుల్లో కరోనా వ్యాధి నిరోధకశక్తిని పెంచే గుణాలున్నాయని బికనీర్‌కు చెందిన ఆ కంపెనీ గొప్పలు చెప్పుకుంది! ఠాట్‌…ఇది నమ్మబుల్‌గా లేదు..ఇలా అసత్య, ఆశాస్త్రీయ సమాచారాన్ని ప్రచారం చేస్తారా అంటూ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ను నెటిజన్లు ఆడిపోసుకుంటున్నారు.