కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సమగ్ర ఏర్పాట్లు.. ప్రత్యేక కార్యాచరణ అవసరమన్న కేంద్రమంత్రి

దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి విముక్తి కలిగించేందుకు త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువస్తుంది కేంద్ర ప్రభుత్వం. ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ ..

కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సమగ్ర ఏర్పాట్లు.. ప్రత్యేక కార్యాచరణ అవసరమన్న కేంద్రమంత్రి

Updated on: Dec 20, 2020 | 4:01 PM

దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి విముక్తి కలిగించేందుకు త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువస్తుంది కేంద్ర ప్రభుత్వం. ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్నవారికి టీకా అందించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 30 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేయాలని అంచనా వేసింది. కరోనా టీకాను వేగంగా అందించాలంటే ప్రత్యేక కార్యాచరణ అవసరమని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. కోవిడ్‌-19పై వీడియోకాన్ఫరెన్స్‌ విధానంలో జరిగిన ఉన్నతస్థాయి మంత్రుల సమావేశంలో హర్షవర్ధన్‌ మాట్లాడారు.

దేశంలో కరోనా కేసుల సంఖ్య కోటి మార్క్‌ దాటిన రోజునే ఈ సమావేశం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశంలో వైరస్‌ వ్యాప్తి 2శాతానికి పడిపోయిందని.. మరణాల రేటు కూడా క్రమంగా తగ్గుముఖం పట్టిందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అత్యల్పంగా 1.45 శాతంగా ఉందని.. రికవరీ రేటు 95.46 శాతానికి చేరిందని మంత్రి పేర్కొన్నారు. అక్టోబరు, నవంబరు నెలలో పండుగలు ఉన్నప్పటికీ సమగ్ర పరీక్షలు, మెరుగైన చికిత్సా విధానాల కారణంగా కొత్త కేసుల్లో పెరుగుదల తగ్గిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

కరోనా టీకా అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోవిడ్‌ నిబంధనలను పాటించాలని మంత్రి సూచించారు. అయితే.. నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ప్రజలకు వేగంగా టీకా వేయాలంటే ప్రత్యేక కార్యాచరణ అవసరమని కేంద్ర మంత్రి తెలిపారు. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్రం చేపట్టిన విధానాలపై సమావేశంలో చర్చించారు

Loading...
Unable to load recommendations.
Follow Us