కరోనా నిజంగానే ‘కరిచేస్తోంది’. ఉద్యోగాలకే ఎసరు తెచ్చిన ఈ మహమ్మారితో నిరుద్యోగులు ఉసూరుమంటున్నారు. చేతిలో సత్తా, మెదడులో మంచి తెలివితేటలు ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి ! ఏం చేయాలో తోచని స్థితి ! అదిగో ! ఇలాంటి తరుణంలోనే చిమ్మ చీకటిలో మెరుపులా, తళుక్కుమనే డిజిటల్ జాబ్స్ మేమున్నామంటూ ఊరిస్తున్నాయి. లక్షణంగా ఇంటి నుంచే పని…చేతినిండా పని.. ‘చేనుకు చేవ..రైతుకు రొక్కం’ లా శుభ్రంగా ఇంట్లోనే కూర్చుని నాలుగు డబ్బులు సంపాదించుకునే రోజులు కూడా ఇవి ! కరోనా ఒక విధంగా మేలే చేసిందని నిరుద్యోగులు యమ సంతోష పడే కాలమంటే ఇదే కాదూ మరి ?
కరోనా, లాక్ డౌన్ కారణంగా సర్వీసు రంగం కుదేలయింది. కానీ ఆప్షన్లు మాత్రం బోలెడున్నాయి. ఎన్నో కొత్త డిజిటల్ ఎవెన్యూలు కవాటాల్లా వాటికవే తెరచుకున్నాయి. వీటిలో ఇన్స్ టాగ్రామ్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ కన్సల్టెంట్, గ్రాఫిక్ డిజైనర్, బ్లాగింగ్, ప్రూఫ్ రీడింగ్, అండ్ ట్రాన్స్ క్రైబింగ్ లాంటి జాబ్స్ ‘ప్లీజ్ కమ్ ‘అని ఆహ్వానిస్తున్నాయి.
కస్టమర్లతో తెలివిగా చాట్ చేయగలిగి, ఇన్స్ టాగ్రామ్ అకౌంట్ ఉంటే చాలు..ఈ మార్కెటింగ్ కాసులు పండిస్తుంది .. ఇక సోషల్ మీడియా మార్కెటింగ్ కన్సల్టెంట్ ఆంటే జొమాటో నుంచి నెట్ ఫ్లిక్స్ వరకు ‘వరాలు’ ఉండనే ఉన్నాయి. మన ‘కుక్కర్’ ‘చోలే’ ఉందంటే అది ఈ జాబ్ మహిమే !
వీటి సోషల్ మీడియా పేజెస్ లో వీటి ఉత్పత్తులకు ప్రచారం చేయడం ద్వారా మన జేబులు వాటికవే నిండుతాయి.
గ్రాఫిక్ డిజైనర్ కావాలనుకుంటే బేసిక్ ఫోటోషాప్, ఇతర విద్యలూ తెలిసి ఉంటే ఇంట్లోనే కూర్చుని ‘బ్యూ కాప్ బక్స్’ సంపాదించుకోవచ్చు.
ఇంటర్నెట్ ద్వారానే బ్లాగింగ్, ప్రూఫ్ రీడింగ్ చేస్తూ పోతే చేసేది కొన్ని గంటలైనా.. వచ్ఛేసొమ్ము మాత్రం బోలెడంత ! ఇంకెందుకాలస్యం ? ప్లీజ్ ! ప్రొసీడ్ !