లామా యాంటీ బాడీలతో కరోనాకు చెక్..!

| Edited By:

Jul 16, 2020 | 2:59 PM

లామా అనే జంతువు రక్తం నుంచి తీసిన యాంటీబాడీలు కోవిడ్ చికిత్సకు ఉపయోగపడతాయని బ్రిటిష్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. లామా కేంద్రంగా వైద్య విజ్ఞాన రంగంలో ఎగ్జైట్‌మెంట్‌కు కారణం ఈ పరిశోధన

లామా యాంటీ బాడీలతో కరోనాకు చెక్..!
Follow us on

లామా అనే జంతువు రక్తం నుంచి తీసిన యాంటీబాడీలు కోవిడ్ చికిత్సకు ఉపయోగపడతాయని బ్రిటిష్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. లామా కేంద్రంగా వైద్య విజ్ఞాన రంగంలో ఎగ్జైట్‌మెంట్‌కు కారణం ఈ పరిశోధన ఫలితాలే. నేచర్ స్ట్రక్చరల్ అండ్ మాలిక్యులర్ బయోలజీ అనే ప్రఖ్యాత సైన్స్ జనరల్‌లో ఈ పరిశోధన ఫలితాలను ప్రచురించారు. లామా కూడా క్షీరదమే. అంటే పిల్లలకు పాలిచ్చి పెంచే జంతు సమూహం. ఒంటెలు, లామాలు ఒకే కుటుంబానికి చెందిన జంతువులు.

కోవిద్-19 వైరస్‌ను ఎదుర్కొనే దిశగా లామా రక్తంతో తయారయ్యే యాంటీ బాడీలు చాలా సరళమైన రసాయనిక నిర్మాణంలో ఉంటాయి. ఈ యాంటీ బాడీలను ఉపయోగించి కరోనా వైరస్‌ను ఎదుర్కొనే దిశగా ఇంగ్లండ్‌లోని రోసాలిండ్ ఫ్రాంక్లిన్ ఇనిస్టిట్యూట్ శాస్తవేత్తలు పరిశోధన జరిపారు. లామా రక్తంలోని యాంటీ బాడీ నుంచి రూపొందించిన నానో బాడీస్ థెరఫి త్వరలోనే క్లినికల్ ట్రయల్స్‌కు వెళ్లనుంది. అంతా సవ్యంగా సాగితే ఈ థెరపి త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఆశించవచ్చు.