తన పదవికి గుడ్ బై చెప్పిన ట్విట్ట‌ర్ ఇండియా పాల‌సీ అధిప‌తి మహిమా కౌల్, కారణం ఎందుకంటే.?

|

Feb 08, 2021 | 12:35 AM

ప్రముఖ సోష‌ల్ మీడియా మాధ్యమం 'ట్విట్ట‌ర్' ఇండియా పాల‌సీ విభాగం అధినేత మ‌హిమా కౌల్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. వ‌చ్చేనెల‌లో ఆమె పూర్తిగా తన బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటారు. ప్రస్తుతం కౌల్, భార‌త్‌తోపాటు

తన పదవికి గుడ్ బై చెప్పిన ట్విట్ట‌ర్ ఇండియా పాల‌సీ అధిప‌తి మహిమా కౌల్, కారణం ఎందుకంటే.?
Follow us on

ప్రముఖ సోష‌ల్ మీడియా మాధ్యమం ‘ట్విట్ట‌ర్’ ఇండియా పాల‌సీ విభాగం అధినేత మ‌హిమా కౌల్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. వ‌చ్చేనెల‌లో ఆమె పూర్తిగా తన బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటారు. ప్రస్తుతం కౌల్, భార‌త్‌తోపాటు ద‌క్షిణాసియా వ్య‌వ‌హారాల పాల‌సీ విభాగం అధిప‌తిగానూ కొన‌సాగుతున్న సంగతి తెలిసిందే. ఇత‌ర ప్రాజెక్టులు చేప‌ట్ట‌డానికి వీలుగా ఆమె రాజీనామా చేసిన‌ట్లు ట్విట్ట‌ర్ యాజ‌మాన్యం ధ్రువీక‌రించింది. గ‌త వార‌మే సంస్థ ప‌బ్లిక్ పాల‌సీ డైరెక్ట‌ర్‌గా ఆమె స్థానాన్ని తెలియ‌జేస్తూ ట్విట్ట‌ర్ ఒక ప్ర‌క‌ట‌న‌లు కూడా జారీచేసిన నేపథ్యంలో కౌల్ రాజీనామా ప్రాముఖ్యత సంతరించుకుంది.

ఇటీవ‌ల రైతుల ఆందోళ‌న‌పై కొన్ని హ్యాండిల్స్ బ్లాకింగ్ అండ్ బ్లాకింగ్‌పై భార‌త ప్ర‌భుత్వం ఫిర్యాదు చేసిన త‌రుణంలో ఆమె వైదొల‌గాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం విశేషం. కొన్ని ట్విట్ట‌ర్ ఖాతాల బ్లాకింగ్‌, ట్వీట్లు తొల‌గించి తిరిగి పున‌రుద్ధ‌రించ‌డంపై త‌లెత్తిన వివాదంపై కేంద్ర ప్ర‌భుత్వ అధికారుల‌తో కౌల్ నేతృత్వంలో చర్చలు జరిగాయి. అయితే, ఆమె రాజీనామాకు ఈ వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేద‌ని ట్విట్ట‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మహిమా కౌల్ ఈ ఏడాది ప్రారంభంలోనే త‌న ప‌ద‌వి నుంచి వైదొల‌గాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని ట్విట్ట‌ర్ ప‌బ్లిక్ పాల‌సీ ఉపాధ్య‌క్షుడు మొనిక్యూ మెచె ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఆమె రాజీనామా త‌మ సంస్థ‌కు న‌ష్ట‌మేన‌న్నారు. ఐదేండ్ల‌కు పైగా ఆమె, సంస్థ పురోగ‌తిలో ముఖ్య‌మైన పాత్ర పోషించార‌ని, అయితే, త‌న వ్య‌క్తిగ‌త జీవితం, సంబంధాలు, ఇత‌ర ముఖ్య‌మైన వ్య‌క్తుల‌తో సంబంధ బాంధ‌వ్యాల‌పై ఫోక‌స్ చేయాల‌ని మ‌హిమా కౌల్ తీసుకున్ననిర్ణ‌యాన్ని త‌మ సంస్థ గౌర‌విస్తుంద‌ని మొనిక్యూ మెచె స్పష్టం చేశారు.

ఉత్తరాఖండ్‌ విలయం: తపోవన్ టన్నెల్ దగ్గర ఒక్కసారిగా పెరిగిన నీటి ఉధృతి, సహాయక చర్యలు నిలిపివేత