తుడా మాజీ చైర్మన్‌కు కరోనా పాజిటివ్..

తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ(తుడా) మాజీ చైర్మన్ నరసింహ యాదవ్‌కు కరోనా సోకింది. ఇటీవల కరోనా లక్షణాలు ఉండటంతో.. పరీక్షలు చేయించుకోగా..

తుడా మాజీ చైర్మన్‌కు కరోనా పాజిటివ్..

Updated on: Aug 29, 2020 | 6:21 PM

TUDA Former Chairman: తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ(తుడా) మాజీ చైర్మన్ నరసింహ యాదవ్‌కు కరోనా సోకింది. ఇటీవల కరోనా లక్షణాలు ఉండటంతో.. పరీక్షలు చేయించుకోగా.. కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన తిరుపతిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారినపడ్డ వారి సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరికీ ఈ వైరస్ సోకుతోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఈ మహమ్మారి బారినపడిన సంగతి తెలిసిందే. (తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్..)