తెలంగాణ కేబినెట్ భేటీ.. ఎజెండా ఇదే..!

మంగళవారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ప్రగతిభవన్ వేదికగా సాయంత్రం 4 గంటలకు జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. నూతన రెవెన్యూచట్టం అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికే పలు దఫాలు సమావేశమై సూచనలు సలహాలు తీసుకున్నారు. కొత్త సచివాలయం నిర్మాణంపై సమావేశంలో చర్చించి శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు చేయనున్నారు. వీటితోపాటు తాజా […]

తెలంగాణ కేబినెట్ భేటీ.. ఎజెండా ఇదే..!

Edited By:

Updated on: Sep 30, 2019 | 6:49 PM

మంగళవారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ప్రగతిభవన్ వేదికగా సాయంత్రం 4 గంటలకు జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. నూతన రెవెన్యూచట్టం అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికే పలు దఫాలు సమావేశమై సూచనలు సలహాలు తీసుకున్నారు. కొత్త సచివాలయం నిర్మాణంపై సమావేశంలో చర్చించి శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు చేయనున్నారు. వీటితోపాటు తాజా రాజకీయ పరిణాలపై చర్చ జరిపే అవకాశం ఉంది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక నేపధ్యంలో ఈ కేబినెట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకున్నది.

Loading...
Unable to load recommendations.
Follow Us