Trump India Visit: ట్రంప్​, ముకేశ్ అంబానీల మధ్య ఆసక్తికర సంభాషణ

భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఢిల్లీలో భారత సీఈఓలు, బిజినెస్ పర్సనాలిటీస్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో  భారత వ్యాపార దిగ్గజాలు ముఖేశ్ అంబానీ( రిలయన్స్), ఎన్ చంద్రశేఖరన్ (టాటా సన్స్),  ఆనంద్ మహీంద్ర (మహీంద్ర అండ్ మహీంద్ర), కుమార మంగళం బిర్లా(బిర్లా గ్రూప్​) తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Trump India Visit:  ట్రంప్​, ముకేశ్ అంబానీల మధ్య ఆసక్తికర సంభాషణ

Updated on: Feb 25, 2020 | 8:29 PM

Trump India Visit:  భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఢిల్లీలో భారత సీఈఓలు, బిజినెస్ పర్సనాలిటీస్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో  భారత వ్యాపార దిగ్గజాలు ముఖేశ్ అంబానీ( రిలయన్స్), ఎన్ చంద్రశేఖరన్ (టాటా సన్స్),  ఆనంద్ మహీంద్ర (మహీంద్ర అండ్ మహీంద్ర), కుమార మంగళం బిర్లా(బిర్లా గ్రూప్​) తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ భేటీలో ట్రంప్‌కు, ముఖేష్ అంబానీకి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అమెరికా చొరవతోనే ఇండియాలో కార్పొరేట్ టారిఫ్ రేట్లు తగ్గినట్టు ముఖేశ్ అంబానీ..ట్రంప్‌కు తెలిపారు.

తాము అమెరికా ఇంధన రంగంలో 7 బిలియన్​ డాలర్లు పెట్టామని…అందుకు వ్యక్తిగతంగా ట్రంప్‌కు ధన్యవాదాలు తెలపాలన్నారు అంబానీ.  ట్రంప్ అమెరికాలో వృద్దిలో చేసిన కృషి మాత్రమే కాదని.. అలాగే ఇండియన్ కంపెనీల అనుమతుల ప్రక్రియను సులభతరం చేశారని పేర్కొన్నారు. ఇది కొనసాగాలని మేం కోరుకుంటున్నామని అంబానీ చెప్పాగా..ట్రంప్ అందుకు సానుకూలంగా స్పందించారు.  అమెరికాలో 7 బిలియన్​ డాలర్ల పెట్టుబడి పెట్టినందుకు ఆనందం వ్యక్తం చేశారు. తాను అధ్యక్షుడిగా కొనసాగినంతవరకు..ఇదే ఫార్ములా కొనసాగుతుందని..అలా జరగని పక్షంలో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమన్నారు. అలాగే అమెరికాలో కంపెనీలు ఏర్పాటు చేయాలనుకునే ఇండియన్ కంపెనీలకు నిబంధనలు సరళతరం చేస్తామని పేర్కొన్నారు

Loading...
Unable to load recommendations.
Follow Us