‘ట్విటర్ రాజా’ డొనాల్డ్ ట్రంప్, సెకండ్ జో బైడెన్, ఏడో స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ

ఈ ఏడాదికి గాను ట్విట్టర్లో జనాలు ఎవరిగురించి ఎక్కువగా ఆసక్తిగా ట్వీట్ చేశారంటే అది అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైనేనట. ఆ తరువాతి స్థానం అధ్యక్షుడు కానున్న జో బైడెన్ కాగా ఏడో స్థానంలో..

'ట్విటర్ రాజా' డొనాల్డ్ ట్రంప్, సెకండ్ జో బైడెన్, ఏడో స్థానంలో ప్రధాని  నరేంద్ర మోదీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 09, 2020 | 8:34 PM

ఈ ఏడాదికి గాను ట్విట్టర్లో జనాలు ఎవరిగురించి ఎక్కువగా ఆసక్తిగా ట్వీట్ చేశారంటే అది అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైనేనట. ఆ తరువాతి స్థానం అధ్యక్షుడు కానున్న జో బైడెన్ కాగా ఏడో స్థానంలో ప్రధాని మోదీ ఉన్నారని ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ తన వార్షిక ‘ఇయర్ ఎండ్ రివ్యూ’లో తెలిపింది. 10 మంది టాప్ మోస్ట్ వ్యక్తుల్లో మోదీ 7 వ స్థానంలో ఉండగా అమెరికా ఉపాధ్యక్షురాలు కానున్న కమలా హారిస్ కి 10 వ స్థానం దక్కింది. ఈ సంవత్సరంలో ఏ రాజకీయ మార్పులు జరుగుతున్నాయి, ప్రపంచంలో ప్రస్తుత నేతల పరిస్థితి ఎలా ఉంది, అన్న అంశాలపై ట్విటరెట్లు ఎక్కువ ఆసక్తి చూపారు. ప్రపంచ వ్యాప్త ఎన్నికలపై 700 మిలియన్ ట్వీట్లు ‘ వెల్లివిరిశాయి’. గ్లోబల్ నేతల్లో ట్రంప్, జో బైడెన్, బరాక్ ఒబామా, మోదీ, కమలా హారిస్ గురించి ఎక్కువగా ట్వీట్లు దర్శనమిచ్చాయి.

ట్విటర్ కు సంబంధించిన కన్స్యూమర్ కమ్యూనికేషన్స్ గ్లోబల్ హెడ్ ట్రౌసీ మెక్ గ్రా తన బ్లాగ్ పోస్టులో ఈ విషయాలు వెల్లడించారు. ఇక ఈ ఏడాది హ్యాష్ ట్యాగుల్లో కోవిడ్ 19 ప్రథమ స్థానం ఆక్రమించింది. దీనికి 400 మిలియన్ ట్వీట్లు దక్కాయి. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ (జార్జి ఫ్లాయిడ్ హత్య) కి రెండో హ్యాష్ ట్యాగ్ లభించింది. రాపర్ కాన్యే వెస్ట్, దివంగత బాస్కెట్ బాల్ ప్లేయర్ బ్రియంట్ కూడా హ్యాష్ ట్యాగుల్లో ఉన్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో