హరీష్ రావు సక్సెస్.. కేటీఆర్ ఫెయిల్!

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఆసక్తికర ఫలితాల్లో అందరూ కూడా కరీంనగర్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల గురించే మాట్లాడుకుంటున్నారు. దానికి గల కారణం టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల మధ్య జరిగిన సవాలే. కాగా కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ పార్టీ భారీ పరాజయం చవి చూస్తే.. మెదక్ పార్లమెంట్ స్థానంలో భారీ ఓట్ల తేడాతో గెలుపొందడం ఇప్పుడు గులాబీ పార్టీలో పెద్ద చర్చనీయాంశం అయింది. దీని బట్టి చూస్తే […]

హరీష్ రావు సక్సెస్.. కేటీఆర్ ఫెయిల్!

Updated on: May 25, 2019 | 12:56 PM

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఆసక్తికర ఫలితాల్లో అందరూ కూడా కరీంనగర్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల గురించే మాట్లాడుకుంటున్నారు. దానికి గల కారణం టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల మధ్య జరిగిన సవాలే. కాగా కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ పార్టీ భారీ పరాజయం చవి చూస్తే.. మెదక్ పార్లమెంట్ స్థానంలో భారీ ఓట్ల తేడాతో గెలుపొందడం ఇప్పుడు గులాబీ పార్టీలో పెద్ద చర్చనీయాంశం అయింది. దీని బట్టి చూస్తే బావ బామ్మర్దుల సవాల్‌లో బావదే పై చేయి అయింది.

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మార్చి 8న మెదక్‌లో టీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సభ జరిగింది. ఆ సభలో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ…మెదక్ ఎంపీ స్థానంలో ఐదు లక్షల మెజారిటీ సాధిస్తామని చెప్పారు. ఇక ఆయన తర్వాత మాట్లాడిన కేటీఆర్..‘‘నేను ఈ రోజు సవాల్ విసురుతున్నా… సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ లోక్‌సభ స్థానంలో కంటే నేను ఎమ్మెల్యేగా ఉన్న కరీంనగర్ ఎంపీ స్థానంలో ఒక్క ఓటైనా గ్యారంటీగా ఎక్కువ తెచ్చుకుంటాం. మా కరీంనగర్ లీడర్లతో మాట్లాడి తప్పకుండా మీకంటే ఒక్క ఓటైనా ఎక్కువ సాధిస్తాం..’’ అని ఛాలెంజ్ చేశారు. ఇక ఈ సవాల్‌లో ఎవరు గెలుస్తారు అని అటు పార్టీ వర్గాలు, ఇటు కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూశారు.

అయితే అందరిని ఆశ్చర్యపరుస్తూ గురువారం వెలువడిన రిజల్ట్‌లో బావదే పైచేయిగా నిలిచింది. మెదక్ ఎంపీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి 3,16,388 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అటు కరీంనగర్ ఎంపీ  స్థానంలో పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఓటమి పాలయ్యారు.