టీఆర్‌ఎస్ పార్టీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే మృతి

టీఆర్‌ఎస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం ఉదయం ఆయన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు.ఆయన వయస్సు 68 ఏళ్లు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన కావేటి సమ్మయ్య.. 2009,2011లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2014లో బీఎస్సీ అభ్యర్ధి చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల […]

టీఆర్‌ఎస్ పార్టీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే మృతి

Edited By:

Updated on: Apr 09, 2020 | 4:18 PM

టీఆర్‌ఎస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం ఉదయం ఆయన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు.ఆయన వయస్సు 68 ఏళ్లు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన కావేటి సమ్మయ్య.. 2009,2011లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2014లో బీఎస్సీ అభ్యర్ధి చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి.. కాంగ్రెస్ గూటికి చేరారరు. అయితే ఆ తర్వాత మళ్ల్లీ టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. కావేటి సమ్మయ్య మరణంపట్ల సీఎం కేసీఆర్‌ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీకి ఆయన సేవలను గుర్తు చేసుకుని.. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us