జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నవారంతా ఆగమేఘాల మీద రెడీ అవుతున్నారు.. పార్టీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు మొదలుపెట్టారు.. పార్టీ టికెట్ ఇవ్వకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేసుకుంటున్నారు కొందరు.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఉద్దేశం కొందరికి ఉంది.. ఇలా స్వతంత్రంగా పోటీ చేసే వారి కోసం ఎన్నికల సంఘం కొన్ని గుర్తులను సిద్ధం చేసింది.. అన్నట్టు ట్రెండ్‌కు తగ్గినట్టుగానే ఎన్నికల సంఘం కూడా గుర్తులను కేటాయించడం విశేషం.. ఇంతకు ముందు జంతువుల గుర్తులు కూడా ఉండేవి.. ఇప్పుడు లేవు.. ఇప్పుడు బాగా పాపులర్ అయిన గుర్తులనే ఎన్నికల సంఘం కేటాయించబోతున్నది.. ఎయిర్ కండిషనర్, యాపిల్ పండు, గాజులు, బ్యాట్, బాల్, విజిల్, టైర్లు, బ్యాటరీ టార్చి, బైనాక్యులర్స్, సీసా, బకెట్, క్యారమ్‌బోర్డు, చెయిన్, కోటు, కొబ్బరి చెట్టు, మంచం, కటింగ్‌ప్లేయర్, కప్పుసాసర్, హెడ్‌ఫోన్, పెన్‌డ్రైవ్, రోబో, కళ్లద్దాలు, కందిల్, బోరింగ్, రోడ్ రోలర్, నిచ్చెన, పలుగుపార, తాళంకప్ప, ప్రెషర్ కుక్కర్, గాలిపటం, స్టూలు, కుట్టు మిషన్, గౌను, గడియారం, రెండాకులు, టోపీ, హాకీస్టిక్, గ్లాస్, గంట, జీపు, బల్బు, శంఖం, నాగలి, బొంగరం, బెండకాయలు, లెటర్‌బాక్స్, రిఫ్రిజిరేటర్, కత్తెర, రంపం, సితార్, స్టెతస్కోప్, టూత్‌బ్రష్, ట్రంపెట్ ఇత్యాది గుర్తులు ఉన్నాయి.. ఫస్ట్ కమ్ ఫస్ట్.. మీకు నచ్చిన గుర్తు కావాలంటే వేగిరపడాలి..