హైదరాబాద్‌- విజయవాడ హైవే పైకి వదర నీరు…

|

Oct 14, 2020 | 3:27 AM

భారీ వర్షాలకు హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ‌శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ సమీపంలో సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి...

హైదరాబాద్‌- విజయవాడ హైవే పైకి వదర నీరు...
Follow us on

భారీ వర్షాలకు హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ‌శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ సమీపంలో సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై వరదనీరు ప్రవహిస్తుండటంతో ముందుకు కదిలే పరిస్థితి కనిపించకపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో రాత్రి మొత్తం ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. వరద నీటిని తొలగించి.. ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్న పోలీసులు, R@B అధికారులు తెలిపారు.

మరోవైపు నగరంలోని చాదర్‌ఘాట్‌ రైల్వేట్రాక్‌ బ్రిడ్జి కింద వరద నీరు నిలిచిపోవడంతో కోఠి వైపునకు.. దిల్‌సుఖ్‌నగర్‌ వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్‌జామ్‌ అయింది. రోడ్లపైకి భారీగా వరదనీరు వచ్చిచేరడంతో ఉప్పల్‌ నుంచి అల్కాపురి మార్గంలో వాహనాలు బ్రేక్‌డౌన్‌తో నిలిచిపోయాయి. కుషాయిగూడలోని ఎన్‌ఎఫ్‌సీ గేటు వద్ద నిలిపి ఉంచిన రెండు కార్లు, ఒక లారీ వరదల్లో కొట్టుకుపోయి చెట్ల వద్ద ఆగిపోయాయి.