ఉభయ తెలుగు రాష్ట్రాలలో పోలీసు అధికారులు, సిబ్బందే టార్గెట్ గా ఓ భారీ సైబర్ స్కామ్ జరుగుతోంది. కేవలం ఖాకీలపై మాత్రమే ఫోకస్ పెడుతూ, వాళ్లకు కొత్త టార్గెట్ విసురుతున్నారు కేటుగాళ్లు. పోలీసుల సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేస్తూ..డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా తిరుమల, తిరుపతికి చెందిన పలువురు పోలీసు అధికారులు సైబర్ నేరగాళ్ల బారినపడ్డారు. వారి వ్యక్తిగత ఫేస్‌బుక్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. సీఐలు రామకృష్ణ, సాయిగిరిధర్.. ఎస్సైలు తిమ్మయ్య, సుమతి ఫేస్‌బుక్ అకౌంట్లు హ్యాక్ చేసిన దుండగులు… డబ్బులు దండుకునే ప్రయత్నం చేశారు. ఫేస్‌బుక్ మెసేంజర్ ద్వారా… ఆయా ఖాతాల్లో ఉన్న స్నేహితులకు మెసేజీలు పంపించి డబ్బులు కావాలని రిక్వెస్ట్ పంపించారు. కొందరు తెలిసిన వ్యక్తులు సదరు పోలీసు అధికారులకు ఫోన్ చేసి… అంత ఎమర్జెన్సీ ఏంటని… ఎలా పంపించాలని వివరాలు అడగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఇలా పలువురు మిత్రులు, బంధువుల నుంచి ఫోన్లు వచ్చాక… పోలీసు అధికారులు అలెర్ట్ అయ్యారు. విచారణ చేస్తే తమ ఫేస్‌బుక్ ఖాతాలు హ్యాక్ అయినట్టు గుర్తించారు. తమ పేర్లతో వచ్చే మెసేజ్ లను నమ్మొద్దని… డబ్బులు వేయొద్దని తమ ఖాతాల్లో పోస్టు చేశారు. దీనిపై తిరుపతి సైబ్ర్ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read :
కృష్ణా జిల్లాలో యాక్సిడెంట్, తండ్రీకూతుళ్లను బలితీసుకున్న లారీ
వివేకా హత్య కేసు అప్డేట్ : ఆర్థిక లావాదేవీల కోణంలో సీబీఐ ఫోకస్