Tirumala News Today: తిరుమలేశుడికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం.. ఎంత వచ్చిందంటే.?

|

Dec 31, 2020 | 8:29 AM

Tirumala News Today: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం సాయంత్రానికి 44,177 మంది భక్తులు..

Tirumala News Today: తిరుమలేశుడికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం.. ఎంత వచ్చిందంటే.?
Tirumala News Today
Follow us on

Tirumala News Today: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం సాయంత్రానికి 44,177 మంది భక్తులు తిరుమలేశుడిని దర్శించుకున్నారు. వీరిలో 9,363 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారు. ఈ విషయాన్ని టీటీడీ అధికారికంగా వెల్లడించింది. నిన్న ఒక్క రోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.90 కోట్లు వచ్చినట్లు తెలిపారు. కాగా, ఈ నెల మొత్తంలో ఐదు సార్లు తిరుమలేశుడి హుండీ ఆదాయం రూ. 3 కోట్లు దాటిందన్నారు.

ఇదిలా ఉంటే, శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తాజాగా టీటీడీ విడుదల చేసింది. భక్తుల సౌకర్యార్ధం రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రోజుకు 20 వేల చొప్పున ఆన్‌లైన్‌లో ఉంచింది. జనవరి 4 నుంచి 31 వరకు టీటీడీ వెబ్‌సైట్ ద్వారా భక్తులకు టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రతీరోజూ ఉదయం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు టైం స్లాట్‌లను ఇచ్చింది. అలాగే కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శనాలు చేసుకోవాలని భక్తులకు టీటీడీ మరోసారి సూచనలు ఇచ్చింది.

Also Read:

తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండుగ శుభవార్త.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు.. పూర్తి వివరాలివే..!

వైఎస్సార్ రైతు భరోసా డబ్బు జమ కాలేదా.? అయితే ఈ నెంబర్‌కు కాల్ చేయండి.!

ట్యాక్స్ పేయర్స్‌కు గుడ్ న్యూస్.. మరోసారి ఐటీ రిటర్న్స్ గడువు పొడిగింపు

ఏపీ ప్రజలకు ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్.. మరో బ్యాడ్ న్యూస్.. అదేంటంటే.!