పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీని వణికిస్తోన్న పులి.! వరుస దాడులతో భయం.. భయం, అటవీప్రాంతంలో 4 ట్రాప్‌ కెమెరాలు

|

Dec 30, 2020 | 10:01 PM

పశ్చిమగోదావరిజిల్లా ఏజెన్సీని పులి వణికిస్తోంది. వరుస దాడులతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఆవులపై పంజా విసిరి చంపేయడంతో గిరిజనుల్లో అలజడి..

పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీని వణికిస్తోన్న పులి.! వరుస దాడులతో భయం.. భయం, అటవీప్రాంతంలో 4 ట్రాప్‌ కెమెరాలు
Follow us on

పశ్చిమగోదావరిజిల్లా ఏజెన్సీని పులి వణికిస్తోంది. వరుస దాడులతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఆవులపై పంజా విసిరి చంపేయడంతో గిరిజనుల్లో అలజడి మొదలైంది. పులి ఆచూకీ కోసం అటవీశాఖ అధికారులు – అణువణువూ గాలిస్తున్నారు. ఇదీ పశ్చిమగోదావరి జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల పరిస్థితి. పులి సంచారం భయంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుండటంతో స్థానికులు బిక్కుబిక్కు మంటున్నారు. తాజాగా… కుక్కునూరు మండలం లచ్చిగూడెంలో ఓ ఆవును హతమార్చింది. దీనిపై అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం అందించారు. పులిజాడ కోసం లచ్చగూడెం అటవీప్రాంతంలో 4 ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. దాన్ని బంధించేందుకు 2 బోన్లు సిద్ధం చేశారు. పులి భయంతో గిరిజనులు బిక్కు బిక్కుమంటున్నారు. మరోవైపు – మొన్న రాత్రి ఓ పులి కుక్కనూరు మండలం ఇసుకపాడుకు వచ్చింది. ఓ రైతు పొలంలోని పశువుల పాకపై దాడి చేసింది. దీంతో ఓ ఆవు చనిపోయింది. మరొకటి గాయపడింది. పశువుల పాక చుట్టుపక్కల ప్రాంతాల్లో పులి పంజా ముద్రలు, రక్తపు మరకలు కనిపించడంతో స్థానికులు – అధికారులకు సమాచారమిచ్చారు. ఆవును చంపాక రెండు కిలోమీటర్ల వరకు పులి లాక్కెళ్లింది. అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇక నుంచి అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. రెండు వారాల పాటు ఏజెన్సీ గ్రామాల ప్రజలు అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని… పశువులను కూడా వదిలిపెట్టొద్దని హెచ్చరించారు.