అవసరం తీరగానే.. అమెరికా తీరు మారింది.. ప్రధాని మోదీని అన్‌ఫాలో చేసిన వైట్‌హౌస్..!

| Edited By:

Apr 29, 2020 | 7:22 PM

కోవిద్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. దాదాపు మూడు వారాల క్రితం వైట్‌హౌస్ ట్విటర్ హ్యాండిల్ భారత ప్రధాని నరేంద్ర మోదీని ఫాలో అయింది. అంతే కాకుండా

అవసరం తీరగానే.. అమెరికా తీరు మారింది.. ప్రధాని మోదీని అన్‌ఫాలో చేసిన వైట్‌హౌస్..!
Follow us on

White House Unfollow PM Modi: కోవిద్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. దాదాపు మూడు వారాల క్రితం వైట్‌హౌస్ ట్విటర్ హ్యాండిల్ భారత ప్రధాని నరేంద్ర మోదీని ఫాలో అయింది. అంతే కాకుండా భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను, అమెరికాలోని భారత్ ఎంబసీ ట్విటర్ హ్యాండిళ్లను కూడా వైట్ హౌస్ ఫాలో అయింది. అంతకుమునుపు.. అమెరికా అధ్యక్షుడి కోరిక మేరకు భారత్ మలేరియా ఔషధం హెచ్‌సీక్యూను అగ్రరాజ్యానికి సరఫరా చేసింది.

కాగా.. ట్రంప్ భారత్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. చేసిన మేలును మర్చిపోమన్నారు. అటువంటి సమయంలో వైట్‌హౌస్.. భారత ప్రధానిని ఫాలో అవడం అందరినీ ఆకర్షించింది. అమెరికా-భారత్‌ల బంధం మరింత బలపడిందని నెటిజన్లు కోడైకోసారు. మరి ఏమైందో ఏమో కానీ.. ఇది జరిగిన మూడు నెలల తరువాత సీన్ పూర్తిగా రివర్స్ అయింది. భారత్ ప్రదాని మోదీని, రాష్ట్రపతిని వైట్ హౌస్ ట్విటర్‌లో అన్‌ఫాలో చేసింది. ప్రస్తుతం శ్వేతశౌధం.. అమెరికా అధ్యక్షుడితో సహా మొత్తం 13 అమెరికా హ్యాండిల్స్‌ను మాత్రమే ఫాలో అవుతోంది. ఈ ఘటనకు దారీతీసిన పరిస్థితులపై స్పష్టత లేకపొవడంతో భారత్ అమెరికాల బంధంపై మళ్లీ చర్చ మొదలైంది.