రానున్న మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. ఈ నెల 13న బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది

రానున్న మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన

Updated on: Sep 10, 2020 | 12:12 PM

అరేబియా సముద్రప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. ఈ నెల 13న బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో రానున్న మూడు రోజులపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలోనూ వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి ఉరుములతో కూడిన వర్షాలు పడనున్నాయని, దక్షిణ కోస్తాంధ్రలోనూ రెండు రోజులపాటు ఓ మోస్తరు వానలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, రాయలసీమలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.