కరోనా అలర్ట్: భారత్‌లో సామూహిక వ్యాప్తి ముప్పు..?

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. భారత్‌లో కరోనా వైరస్‌ సామూహిక వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య

కరోనా అలర్ట్: భారత్‌లో సామూహిక వ్యాప్తి ముప్పు..?

Edited By:

Updated on: May 15, 2020 | 6:12 PM

Community transmission: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. భారత్‌లో కరోనా వైరస్‌ సామూహిక వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపులతో ముప్పు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. కొందరైతే ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వైరస్‌ మూడో దశలో ఉందని భావిస్తున్నారని భారత ప్రజారోగ్య స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు ప్రొఫెసర్‌, డాక్టర్‌ కె.శ్రీనాథరెడ్డి తెలిపారు.

Also Watch: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం

కాగా.. డాక్టర్‌ కె.శ్రీనాథరెడ్డి ఇంతకుముందు హార్వర్డ్‌, సిడ్నీ మెడికల్‌ యూనివర్సిటీ, ఎయిమ్స్‌ మరికొన్ని చోట్ల పనిచేశారు. కేసులను గమనిస్తే ప్రయాణాలకు సంబంధంలేనివి కనిపిస్తున్నాయని శ్రీనాథరెడ్డి అన్నారు. ప్రభుత్వాలు చాలావరకు విదేశాల నుంచి తిరిగొచ్చిన వారిపైనే దృష్టిపెట్టాయని వెల్లడించారు.

Also Watch: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం

తాజాగా వైరస్‌ వ్యాప్తి రెండో దశలో ఉందంటున్నవారు స్థానిక వ్యాప్తిని గుర్తించారని తెలిపారు. అందుకే సామూహిక వ్యాప్తి అనే పదం ఉపయోగించడం లేదని తెలిపారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న పదజాలంపై చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ భారత్‌కు సామూహికవ్యాప్తి ముప్పు పొంచిఉందని ఆయన హెచ్చరించారు.

Also Watch: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం

ఎక్కువ జన సమ్మర్ధం ఉండే ప్రదేశాలు, మురికివాడలు, తాత్కాలిక నివాస కేంద్రాల వద్ద కఠిన జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీనాథరెడ్డి అన్నారు. అదృష్టవశాత్తూ పెద్ద నగరాల్లోనే వైరస్‌ వ్యాప్తి ఉందని పేర్కొన్నారు. వలస కార్మికులు వైరస్‌ బాధితులు కాకుండా చూసుకోవాలన్నారు. ఎక్కువ మంది జీవిస్తున్న గ్రామీణ భారతాన్ని రక్షించుకోవాలని సూచించారు.

Also Watch: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం