వరస్ట్ క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చినా.. పాప ఫుల్ హ్యాపీ.. వీడియో వైరల్!

క్రిస్మస్ కావడంతో చిన్నపిల్లలు తన తల్లిదండ్రుల దగ్గర నుంచి గిఫ్ట్స్ ఆశించడం సహజం. ఎవరైనా సరే చాక్లెట్స్, బిస్కెట్స్, బొమ్మలు లాంటివి ఇస్తారు. అయితే ఇక్కడ ఓ తల్లి మాత్రం తన రెండేళ్ల కూతురికి బనానాను గిఫ్ట్‌గా ఇచ్చింది. యూట్యూబర్‌ జస్టిస్‌ మొజికా తన రెండేళ్ల కూతురితో ప్రాంక్ వీడియో చేసింది. అందులో భాగంగా వరస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌గా కూతురికి అరటిపండును గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చింది. దాన్ని ఓపెన్ చేసిన ఆ చిన్న పాప మురిసిపోయి.. […]

వరస్ట్ క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చినా.. పాప ఫుల్ హ్యాపీ.. వీడియో వైరల్!

Updated on: Dec 25, 2019 | 9:05 PM

క్రిస్మస్ కావడంతో చిన్నపిల్లలు తన తల్లిదండ్రుల దగ్గర నుంచి గిఫ్ట్స్ ఆశించడం సహజం. ఎవరైనా సరే చాక్లెట్స్, బిస్కెట్స్, బొమ్మలు లాంటివి ఇస్తారు. అయితే ఇక్కడ ఓ తల్లి మాత్రం తన రెండేళ్ల కూతురికి బనానాను గిఫ్ట్‌గా ఇచ్చింది. యూట్యూబర్‌ జస్టిస్‌ మొజికా తన రెండేళ్ల కూతురితో ప్రాంక్ వీడియో చేసింది. అందులో భాగంగా వరస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌గా కూతురికి అరటిపండును గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చింది.

దాన్ని ఓపెన్ చేసిన ఆ చిన్న పాప మురిసిపోయి.. ముద్దు ముద్దుగా ‘బనానా.. బనానా’ అంటూ తెగ సంబరపడింది. అంతేకాకుండా తన తల్లిని ఒలిచి ఇవ్వమని చెప్పి.. మనసారా ఆరగించింది. ఇక దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే 20 మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించగా.. అందరూ కూడా షేర్లు మీద షేర్లు చేస్తున్నారు.