Booster Shot Scam: బూస్టర్ డోస్‌ స్కామ్‌.. వీరిని అస్సలు నమ్మకండి.. లేదంటే డబ్బులు మాయం..

|

Jan 12, 2022 | 3:42 PM

Booster Shot Scam: 60 ఏళ్లు పైబడిన పౌరుల కోసం ప్రభుత్వం ముందుజాగ్రత్తగా బూస్టర్ డోస్ అందించడం ప్రారంభించింది. ఓమిక్రాన్ కేసులు

Booster Shot Scam: బూస్టర్ డోస్‌ స్కామ్‌.. వీరిని అస్సలు నమ్మకండి.. లేదంటే డబ్బులు మాయం..
Booster Shot Scam
Follow us on

Booster Shot Scam: 60 ఏళ్లు పైబడిన పౌరుల కోసం ప్రభుత్వం ముందుజాగ్రత్తగా బూస్టర్ డోస్ అందించడం ప్రారంభించింది. ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రజలు బూస్టర్ డోస్‌ పొందడానికి హడావిడిగా ఉన్నారు. అయితే సైబర్ నేరగాళ్లు ఇదే అదనుగా వారిని మోసం చేసే పనిలో పడ్డారు. బూస్టర్ డోస్‌కి సంబంధించిన వివరాలను అందించే నెపంతో వ్యక్తుల నుంచి కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. అనంతరం బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులను కాజేస్తున్నారు.

బూస్టర్ డోస్‌ స్కామ్ ఎలా జరుగుతుంది
మోసగాళ్లు ముందుగా మీకు కాల్ చేసి తమను తాము ప్రభుత్వ ఉద్యోగులుగా చెప్పుకుంటారు. వీరు ఎక్కువగా సీనియర్ సిటిజన్లను ఎంచుకుంటారు. ఫోన్‌లో రెండు డోసుల టీకాలు పూర్తి చేశారా అని అడుగుతారు. కొన్ని సందర్భాల్లో మీకు సంబంధించిన పూర్తి సమాచారం కలిగి ఉంటారు. మీ పేరు, వయస్సు, చిరునామా, ఇతర వివరాలు అన్ని తెలియజేసి నిజమైనవారిలా నమ్మిస్తారు. అంతేకాదు మీరు టీకా వేసుకున్న తేదీని కూడా చెబుతారు.

తర్వాత బూస్టర్ డోస్‌ పొందడానికి ఆసక్తి కలిగి ఉన్నారా లేదా అని అడుగుతారు. స్లాట్‌ను బుక్ చేయాలని చెప్పి తేదీ, సమయాన్ని నిర్దారిస్తాడు. అనంతరం మీ మొబైల్‌కి వచ్చే OTP అడుగుతాడు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ OTP మీ ఖాతా నుంచి డబ్బు కాజేయడానికి ఉపయోగిస్తారు. మీరు వారికి OTP చెప్పగానే మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు కట్‌ అయినట్లు మీకు మెస్సేజ్ వస్తుంది.

ఈ స్కామ్‌కి బలి కాకుండా ఎలా ఉండాలి
ప్రభుత్వం ఫోన్ కాల్స్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్‌లను బుక్ చేయదని తెలుసుకోండి. మీరు కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం స్లాట్‌ను బుక్ చేయాలనుకుంటే http://cowin.gov.inని సందర్శించవచ్చు. ఆరోగ్య సేతు మొబైల్ అప్లికేషన్ ద్వారా సందర్శించవచ్చు. ఒకవేళ మీరు వీటి ద్వారా స్లాట్‌ను బుక్ చేయలేకపోతే ఏదైనా టీకా కేంద్రంలోకి వెళ్లి బూస్టర్ డోస్ పొందవచ్చు. ప్రజలు సాధారణంగా OTPతో పాటు వచ్చే సందేశాన్ని తప్పకుండా చదవాలి. మీరు మీ వన్-టైమ్ పాస్‌వర్డ్‌ను ఎవరితోనూ చెప్పకూడదని గుర్తుంచుకోండి.

హైహీల్స్ వేసుకునే మహిళలు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి..! ఏంటంటే..?

చికెన్, మొక్కజొన్న సూప్‌తో జలుబుకి చెక్..! ఇంట్లోనే ఇలా తయారుచేయండి..?

కొత్త ఫోన్ కొనేముందు ఒక్కసారి ఆలోచించండి.. ఈ 5 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి..