అంతా కరోనా మహిమ… కరోనా వైరస్ వల్ల ఆప్తుల శుభకార్యాలకు వెళ్లలేకపోతున్నారు.. ఒకవేళ వెళ్లినా.. ఆ వేడుక ముగిసేవరకు ముక్కు, మూతి మూసుకుంటూ.. చేతులు ముడుచుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు… ఈ బాధలన్నీ ఎందుకని చాలామంది పెళ్లిళ్లకు హాజరు కాకుండా ఇళ్లలోనే ఉంటున్నారు. దీంతో ఎప్పుడూ అతిథులతో కళకల్లాడే పెళ్లి వేదికలు.. బోసిపోతున్నాయి. అలాగే, విందు కోసం సిద్ధం చేసిన వంటకాలు సైతం మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైకు చెందిన ఓ కుటుంబానికి కొత్త ఐడియా వచ్చింది…
New trend of marriage invitation. Marriage food will be delivered at your doorstep. pic.twitter.com/ooEz1qbsvP
— Shivani (@Astro_Healer_Sh) December 10, 2020
పెళ్లికి పిలిచి అతిథులను రిస్కులో పాడేయడం ఎందుకని భావించిన ఆ కుటుంబ విందును నేరుగా వారి ఇళ్లకే పంపించి ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన శుభలేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శుభలేఖ ప్రకారం.. డిసెంబరు 10న తమ కుమారుడి పెళ్లి జరుగుతోందని, అందరి ఆశ్వీరాదాలు కావాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెళ్లి వేడుక లైవ్ టెలికాస్ట్ లింక్, పాస్‌వర్డ్ వివరాలను సైతం శుభలేఖలో పేర్కొన్నారు. చివరిగా.. అతిథుల కోసం భోజనాలను ఇంటి వద్దకే పంపిస్తున్నామని, దయచేసి వాటిని స్వీకరించాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఓ నెటిజన్ ట్విట్టర్ వేదిక పోస్టు చేయడంతో ఈ వార్త వైరల్ అయ్యింది.