మీ ఫోన్‌లో చైనా యాప్‌లను తొలగించేందుకు సరికొత్త యాప్..

కొన్ని రోజులుగా భారత్- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రపంచదేశాలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్ మొదటిగా వుహాన్ నగరంలో పుట్టింది. ఇక చైనీస్ యాప్ అయిన టిక్ టాక్ మత విద్వేషాలు రెచ్చగొట్టడమే కాకుండా, జంతు హింస, తప్పుడు మార్గాలను ప్రేరేపించేలా ఉండే వీడియోలను ప్రోత్సహిస్తోందంటూ ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఇలా మరెన్నో కారణాల వల్ల భారతీయులు చైనా యాప్‌లపై యుద్ధం ప్రకటించారు. తమ ఫోన్ల నుంచి ఆ […]

మీ ఫోన్‌లో చైనా యాప్‌లను తొలగించేందుకు సరికొత్త యాప్..

Updated on: May 31, 2020 | 5:05 PM

కొన్ని రోజులుగా భారత్- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రపంచదేశాలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్ మొదటిగా వుహాన్ నగరంలో పుట్టింది. ఇక చైనీస్ యాప్ అయిన టిక్ టాక్ మత విద్వేషాలు రెచ్చగొట్టడమే కాకుండా, జంతు హింస, తప్పుడు మార్గాలను ప్రేరేపించేలా ఉండే వీడియోలను ప్రోత్సహిస్తోందంటూ ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఇలా మరెన్నో కారణాల వల్ల భారతీయులు చైనా యాప్‌లపై యుద్ధం ప్రకటించారు.

తమ ఫోన్ల నుంచి ఆ యాప్‌లను రిమూవ్ చేస్తున్నారు. అటు ప్రధాని మోదీ కూడా ‘ఆత్మ నిర్భర్’ అని ప్రస్తావించడంతో పాటు.. పౌరులు భారతీయ వ్యాపారానికి సహకరించాలని ప్రధాని కోరిన సంగతి తెలిసిందే. ఈ  నేపథ్యంలో వన్ టచ్ యాప్స్ ల్యాబ్స్ యూజర్లు తమ ఫోన్ల నుంచి చైనా యాప్స్ అన్ ఇన్ స్టాల్ చేసుకునేందుకు వీలుగా ‘రిమూవ్ చైనా యాప్స్’ అనే సరికొత్త యాప్‌ను రూపొందించింది.

ఈ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లేస్టోర్‌లో టాప్ ఫ్రీ అప్లికేషన్ కాగా.. ఇప్పటికే 1 మిలియన్ పైగా డౌన్‌లోడ్‌లను కూడా పూర్తి చేసుకుంది. అటు 51,000 మంది వినియోగదారుల నుంచి రివ్యూస్ రాగా.. 4.8 రేటింగ్‌తో దూసుకుపోతోంది. ఇక ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేయగానే.. అది ఫోన్ లో ఉన్న చైనా యాప్స్ ను స్కాన్ చేసి వివరాలను తెలియజేస్తుంది. దానితో మొత్తం అన్ని చైనీస్ యాప్స్ డిలీట్ అయిపోతాయి.

https://play.google.com/store/apps/details?id=com.chinaappsremover